విదేశీ పెట్టుబడులకు, విపక్షాల ఆందోళనలకు తలుపులుతెరిచారు
మల్టీబ్రాండ్ రిటైల్‌లో 51 శాతం ఎఫ్‌డీఐ
విమానయాన రంగంలో 49 శాతం
ప్రసార రంగంలో 74 శాతానికి పెంపు
పవర్ ట్రేడింగ్ ఎక్ఛేంజిలలో 49% వరకు
4 ప్రభుత్వరంగ సంస్థల్లో వాటా విక్రయం
కేంద్ర మంత్రివర్గం నిర్ణయాలు
అండర్ అచీవర్.. అంటూ విదేశీ పత్రిక ప్రచురించిన ముఖచిత్ర కథనం ప్రభావమో... భారత్‌లో సంస్కరణల వేగం మందగించిందని అమెరికా అధ్యక్షుడు ఒబామా గతంలో పరోక్షంగా చేసిన వ్యాఖ్యల ప్రభావమో కానీ.. మన్మోహన్
సర్కారు జూలు విదిల్చింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల వరద పోటెత్తేలా.... ఇప్పటివరకు ఉన్న పరిమితులకు గండి కొట్టేసింది. ప్రభుత్వ నిర్ణయంపై విపక్షాలు భగ్గుమన్నాయి. వామపక్షాలు దేశవ్యాప్త నిరసనలకు రంగం సిద్ధం చేస్తున్నాయి. ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షమైన తృణమూల్ కాంగ్రెస్ అగ్గిమీద గుగ్గిలమయింది. నిర్ణయాన్ని ఉపసంహరించుకునేందుకు 72గంటల డెడ్‌లైన్ విధించింది. లేదంటే కఠిన నిర్ణయం తీసుకోక తప్పదని హెచ్చరించింది. భాజపా సహా విపక్ష పాలిత రాష్ట్రాలు.. మల్టీబ్రాండ్ రిటైల్‌లో 51 శాతం ఎఫ్‌డీఐలను అనుమతించబోమని తెగేసి చెప్పాయి. యూపీఏకు మద్దతిస్తున్న సమాజ్‌వాదీ పార్టీ కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించింది. ప్రభుత్వం మాత్రం విపక్షాలతో ఢీ అంటే ఢీ అంటోంది.
తలుపులు బార్లా
విమానయానంలో 49% ఎఫ్‌డీఐ
బహుళ బ్రాండ్ల రిటైల్ వర్తకంలో 51 శాతం
బ్రాడ్ కాస్టింగ్‌లో విదేశీ పరిమితి 74%కి పెంపు
ప్రసార భారతికి పునరుజ్జీవం
4 ప్రభుత్వరంగ సంస్థల్లో వాటా విక్రయం
మన్మోహన్ సర్కారు కీలక నిర్ణయాలు
న్యూఢిల్లీ:
ప్రస్తుత కష్ట కాలంలో ఆర్థిక వృద్ధిరేటుకు వూతం ఇవ్వడంతోపాటు ఉద్యోగావకాశాలు కల్పించే లక్ష్యంతో విమానయానం, మల్టీ బ్రాండ్ రిటైల్, ఇతర రంగాల్లో విదేశ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించాలని నిర్ణయించాం. దేశ ప్రయోజనాలను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకున్నాం. ఆర్థిక వృద్ధిరేటును గాడిలోకి తీసుకువచ్చి భారత్‌ను విదేశీ పెట్టుబడులకు ఆకర్షణీయ గమ్యస్థానంగా తీర్చిదిద్దడానికి చాలా రోజులుగా పెండింగ్‌లో ఉన్న అంశాలపై ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) నిర్ణయాలు తీసుకుంది. 'వృద్ధి ప్రక్రియను ఈ నిర్ణయాలు వేగిరం చేస్తాయని భావిస్తున్నా. అదనపు ఉద్యోగావకాశాలను కల్పించగలవు. అన్ని వర్గాల నుంచి మద్దతు కోరుతున్నా.
డీజిల్ ధరల పెంపుతో దేశంలో సామాన్యుడ్ని కంగు తినిపించిన మన్మోహన్ సర్కారు ఆ మర్నాడే 'విదేశీ' మదుపర్లపై తన మక్కువ ఏపాటిదో తెలియజెప్పింది. ఇదిగో రేటింగ్ తగ్గించేస్తాం.. అదిగో వెనక్కి వెళ్లిపోతాం.. అంటూ బెదిరిస్తూ వచ్చిన 'విదేశీ' ను మెప్పించే భారీ సంస్కరణలతో తలుపులు బార్లా తెరిచింది. దేశీయ విమానయాన రంగంలో విదేశీ విమాన సంస్థలకు 49 శాతం వాటాతో ఆహ్వానం పలికింది. ప్రస్తుత సూపర్ మార్కెట్ల యుగంలో మల్టీబ్రాండ్ రిటైల్‌లో 51 శాతం విదేశీ పెట్టుబడులకు సమ్మతించింది. ప్రసార మాధ్యమాలు, విద్యుత్ రంగాల్లోనూ సంస్కరణలు చేపట్టింది. ప్రసారభారతికి పరిపుష్ఠినిస్తూ.. నాలుగు కీలక ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణకు సిద్ధమైంది. ఆర్థిక వ్యవస్థ కోలుకునేందుకు ప్రభుత్వ నిర్ణయాలు దోహదపడతాయంటూ వాణిజ్య, పారిశ్రామిక రంగాలు ప్రస్తుతించగా.. ఆర్థికవేత్తలు, విశ్లేషకులు ఇది మంచి యత్నమేనంటూ మెచ్చుకున్నారు. రాజకీయంగా మాత్రం ప్రభుత్వానికివి ఇబ్బందికరమైన రోజులే. డీజిల్ ధరల పెంపు నిర్ణయంతో శుక్రవారం ఉరకలేసిన స్టాక్‌మార్కెట్లు.. సోమవారం మరింత దూసుకుపోయేందుకు ప్రభుత్వ తాజా నిర్ణయాలు ఉపకరిస్తాయన్నది నిర్వివాదాంశం. అదే రోజు ఆర్‌బీఐ పరపతి విధాన సమీక్షలో కీలక వడ్డీ రేట్లను కొద్దోగొప్పో తగ్గించినా చాలు.. ప్రధాని కోరినట్లు ఈ సంస్కరణ యత్నాలకు అన్ని వర్గాల నుంచి మద్దతు వెల్లువెత్తడం ఖాయం. శుక్రవారం నాడిక్కడ మన్మోహన్ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం (సీసీఈఏ) తీసుకున్న కీలక నిర్ణయాల వివరాలు..
బహుళ బ్రాండ్ల రిటైల్‌లో ..
బహుళ బ్రాండ్ల (మల్టీ-బ్రాండ్) రిటైల్ వర్తకంలో 51 శాతం విదేశీ పెట్టుబడికి కేంద్రం ఆమోదముద్ర వేసింది. ఇటువంటి రిటైల్ సంస్థల కార్యకలాపాలను అనుమతించే విషయంలో తుది అధికారాన్ని మాత్రం రాష్ట్రాలకే అప్పగించింది. సింగిల్ బ్రాండ్ రిటైల్ విభాగంలో కార్యకలాపాలు సాగిస్తున్న విదేశీ సంస్థలు తాము విక్రయించే వస్తువుల్లో 30 శాతాన్ని దేశీయంగానే సమీకరించాలనే నిబంధన నుంచి మినహాయింపు పొందటానికి కూడా వీలుకల్పించింది. ఇటువంటి మినహాయింపు లభించాలంటే, ఆ సంస్థలు మనదేశంలో ఉత్పత్తి సదుపాయాలను మాత్రం ప్రారంభించాల్సి ఉంటుంది. గత నవంబరులోనే మల్టీ-బ్రాండ్ రిటైల్‌లో 51 శాతం విదేశీ పెట్టుబడికి అనుమతిచ్చినా.. విపక్షాల వచ్చిన వ్యతిరేకతతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది.
ప్రభుత్వ నిర్ణయం వల్ల వాల్-మార్ట్ వంటి సంస్థలు స్థానికంగా ఒక భాగస్వామితో కలిసి మనదేశంలో నేరుగా రిటైల్ వ్యాపారంలోకి ప్రవేశించే వీలుకలుగుతుంది. దేశీయ రిటైల్ వ్యాపారం దాదాపు 500 బిలియన్ డాలర్లని అంచనా కాగా, దీన్లో ప్రవేశించి లాభాలనార్జించే అవకాశాన్ని విదేశీ సంస్థలకు ఎందుకివ్వాలని ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించే పక్షాలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. అదే సమయంలో స్థానికంగా రిటైల్ వ్యాపారంలో ఉన్నవారు ఉపాధి కోల్పోవలసి వస్తుందనే ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.
విమానయాన సంస్థల్లో ..
దేశీయ విమానయాన సంస్థల్లో విదేశీ విమానసంస్థలు 49 శాతం వాటా కొనుగోలు చేసేందుకు అనుమతి ఇవ్వటం సీసీఈఏ నిర్ణయాల్లో కీలకమైనది. దాదాపు రూ.7,000 కోట్ల రుణభారంతో ఖాయిలా ముంగిట నిలిచిన కింగ్‌ఫిషర్ వంటి సంస్థకు ఇదెంతో మేలు చేకూరుస్తుంది. స్పైస్‌జెట్, గోఎయిర్ తదితర సంస్థలకూ ప్రయోజనం చేకూరుతుంది. వాస్తవానికి విమానయాన రంగంలో విదేశీ పెట్టుబడులను గతంలోనే అనుమతించారు. విమానేతర రంగాల్లోని సంస్థలు మనదేశంలో విమానయాన రంగంలో పెట్టుబడులు పెట్టవచ్చు. ఇక్కడి విమానయాన సంస్థల్లో 49 శాతం వాటా కొనుగోలు చేయవచ్చు. కానీ విదేశీ విమానయాన సంస్థలు, దేశీయ విమాన సంస్థల్లో వాటా కొనుగోలు చేసేందుకు ఇప్పుడు అనుమతించారు. తాజా నిర్ణయాల నేపథ్యంలో గల్ఫ్‌కు చెందిన ఎమిరేట్స్ ఎయిర్‌వేస్ దేశీయ విమానయాన సంస్థల్లో వాటా కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తుందని భావిస్తున్నారు. బ్రిటీష్ ఎయిర్‌వేస్, వర్జిన్ అట్లాంటిక్ వంటి సంస్థలు, గల్ఫ్‌కు చెందిన ఖతార్ ఎయిర్‌వేస్, ఎతిహాద్ కూడా మనదేశంలోని విమానయాన సంస్థల్లో వాటా కొనుగోలు చేసే అవకాశం ఉన్నట్లు పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ప్రభుత్వ కల్పించే వెసులుబాటుతో స్పైస్‌జెట్ కూడా విదేశీ విమానయాన సంస్థలకు వాటా విక్రయించే అవకాశం ఉందని తెలుస్తోంది.
ప్రసార రంగంలో..
ప్రసార రంగంలో 74 శాతానికి విదేశీ పెట్టుబడి పరిమితిని పెంచే ప్రతిపాదనకూ ఆమోదం లభించింది. అయితే టీవీ వార్తా ఛానళ్లు, ఎఫ్‌ఎం రేడియో స్టేషన్లకు మాత్రం ఇది వర్తించదు. ఈ రెండింటికి ప్రస్తుతం ఉన్న 26 శాతం విదేశీ పెట్టుబడి పరిమితి కొనసాగుతుంది. డీటీహెచ్ (డైరెక్ట్-టు-హోమ్), హెడ్-ఎండ్ ఇన్ ద స్కై (హిట్స్), ఎంఎస్‌ఓ, కేబుల్ టీవీ, భవిష్యత్తులో శరవేగంగా విస్తరిస్తుందని భావిస్తున్న మొబైల్ టీవీ విభాగాలకు 74 శాతం వరకూ విదేశీ పెట్టుబడి పరిమితి పెంపుదల వర్తిస్తుంది. ఈ వ్యాపారాలు చేస్తున్న దేశీయ కంపెనీల్లో, విదేశీ కంపెనీలు 74 శాతం వరకూ నేరుగా పెట్టుబడి పెట్టవచ్చు. టీవీ వార్తా ఛానళ్లు, ఎఫ్‌ఎం రేడియో స్టేషన్లను నిర్వహిస్తున్న కంపెనీల్లో మాత్రం 26 శాతం విదేశీ పెట్టుబడికి ఎఫ్‌ఐపీబీ (విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక సంస్థ) అనుమతి తీసుకోవాలి.
ప్రసార భారతికి మంచి రోజులు
ప్రసార భారతి ఆర్థిక పునర్‌వ్యవస్థీకరణను ప్రభుత్వం ఆమోదించింది. 2012-13 నుంచి 2016-17 వరకూ వేతనాలు, వేతన సంబంధ వ్యయాల చెల్లింపునకు ప్రసార భారతికి ప్రభుత్వం ప్రణాళికేతర మద్దతు ఇస్తుంది. మిగిలిన అన్ని నిర్వహణ వ్యయాలను సంస్థే భరించాల్సి ఉంటుంది. ప్రత్యేక అవసరాలకు మాత్రమే ప్రణాళిక మద్దతు లభిస్తుంది. రుణాల రూపంలో కాక గ్రాంట్-ఇన్-ఎయిడ్ రూపంలో నిధులు అందిస్తారు. హోంమంత్రి ఆధ్వర్యంలో ప్రసార భారతిపై ఏర్పాటు చేసిన మంత్రుల బృందం సిఫారసుల మేరకు ఈ నిర్ణయాలు తీసుకున్నారు. రుణాలపై చెల్లించాల్సిన వడ్డీని, వడ్డీ చెల్లించనందుకు విధించిన జరిమానాను ప్రభుత్వం రద్దు చేసింది. ప్రసార భారతికి ఇచ్చిన మూలధన, ఇతర రుణాలను గ్రాట్స్-ఇన్-ఎయిడ్‌గా మారుస్తారు. స్పెక్ట్రమ్ ఛార్జీలు తదితరాలకు సంబంధించి 2011, మార్చి 31 వరకూ ప్రసార భారతి రూ.1,349.54 కోట్లు చెల్లించాల్సి ఉంది. వీటిని కూడా ప్రభుత్వం రద్దు చేసింది.
4 ప్రభుత్వ కంపెనీల్లో వాటా విక్రయం
నాలుగు ప్రభుత్వ రంగ సంస్థల్లో (పీఎస్‌యూ) వాటాను విక్రయించడానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దీని ప్రకారం రూ.15,000 కోట్ల సమీకరణకు ఆయిల్ ఇండియాలో 10 శాతం, హిందుస్థాన్ కాపర్‌లో 9.59 శాతం, నాల్కోలో 12.15 శాతం, ఎంఎంటీసీలో 9.33 శాతం వాటాను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌సీ) ద్వారా విక్రయిస్తారు.
విద్యుత్తు రంగంలో ..: పవర్ ట్రేడింగ్ ఎక్స్ఛేంజీలలో 49 శాతం వరకు విదేశీ పెట్టుబడులను అనుమతించారు. ఈ 49 శాతం లోనూ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్‌డీఐ) 26 శాతానికి మించకూడదు; కాగా విదేశీ సంస్థాగత మదుపరుల (ఎఫ్‌ఐఐ) పెట్టుబడి చెల్లించిన మూలధనంలో 23 శాతానికి పరిమితం కావాలి. ఎఫ్‌డీఐని ప్రభుత్వ ఆమోదం ద్వారాను, ఎఫ్‌ఐఐ పెట్టుబడులను ఆటోమేటిక్ మార్గం ద్వారాను అనుమతిస్తారు. ప్రస్తుతం దేశంలో పవర్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఎనర్జీ ఎక్స్ఛేంజీలు ఉన్నాయి. ఎఫ్‌ఐఐల కొనుగోళ్లను సెకండరీ మార్కెటుకు మాత్రమే పరిమితం చేస్తారు. పవర్ ట్రేడింగ్ ఎక్స్ఛేంజీలను బలోపేతం చేయడానికి ఈ నిర్ణయం తోడ్పడనుంది. అంతే కాకుండా విద్యుత్తు ప్రసారాన్ని మెరుగుపరుస్తుంది.
దేనికైనా సిద్ధపడే...
ముందస్తు ఎన్నికలకైనా సరే?
అందుకే ఈ దూకుడు
సంస్కరణలు అమలు చేయకపోతే భవిష్యత్తు లేదని భావిస్తున్న ప్రభుత్వం
మన్మోహన్‌కు అండగా కాంగ్రెస్
న్యూఢిల్లీ - న్యూస్‌టుడే
మన్మోహన్ ప్రభుత్వం అమీతుమీకి సిద్ధమయిందా? రాజకీయంగా ఎంతటికైనా తెగబడాలని నిశ్చయానికి వచ్చిందా? ఎటువంటి పరిమాణాలు ఎదురైనా ఢీకొనడానికి సిద్ధపడినందునే గత రెండు రోజులుగా.. రాజకీయంగా ప్రతికూలమైన నిర్ణయాలు తీసుకుంటోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను పెంచడం సహా.. భారీ ఆర్థిక సంస్కరణలకు శుక్రవారం తెరతీయడం ద్వారా... లోక్‌సభకు ముందస్తు ఎన్నికలకు వెళ్లడం సహా దేనికైనా సిద్ధమనే సవాల్‌ను విసిరినట్లు భావిస్తున్నారు. పెట్రోమోతపై గురువారం తీసుకున్న నిర్ణయంతో పాటు శుక్రవారం తీసుకున్న కీలక నిర్ణయంతో... విపక్షాలపై ఎదురుదాడికి ప్రభుత్వం పూర్తిస్థాయిలో రంగం సిద్ధం చేసుకున్నట్లు కనబడుతోంది.
ఇప్పటి వరకు 2జీ కేటాయింపులు, బొగ్గు గనుల కేటాయింపులపై విపక్షాల విమర్శలకు రాజకీయంగానే బదులిస్తూ వస్తున్న ప్రభుత్వం... ఆర్థిక పరిస్థితుల వాస్తవాలను దృష్టిలో పెట్టుకుని, ఎప్పటినుంచో అమలు చేయాలనుకుంటున్న ఆర్థిక అజెండాను అమలు చేయాల్సిన సమయం ఇదేనని నిర్ణయానికి వచ్చినట్లు ఏఐసీసీ వర్గాలు వెల్లడించాయి. ''భారత ఆర్థిక వ్యవస్థ కుదేలైతే.. భారత రాజకీయమూ కుదేలవుతుంది.'' అని కేంద్ర మంత్రి ఒకరు చెప్పారు.
క్షేత్రస్థాయి వాస్తవాలను దృష్టిలో పెట్టుకునే మన్మోహన్‌సింగ్.. రాజకీయంగా ఎంతటి ముప్పు పొంచి ఉన్నా.. ఈ దూకుడు నిర్ణయం తీసుకున్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. భాగస్వామ్య పక్షాలు, మిత్రపక్షాలు ఎదురు తిరిగినా, సంస్కరణల అజెండాను భుజాన వేసుకుని పోరాడాలనే కాంగ్రెస్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఆ పార్టీలు మద్దతు ఉపసంహరించుకునేంత కఠిన నిర్ణయాలు తీసుకోబోవని, ప్రకటనలకే పరిమితమవుతాయని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. సంస్కరణల అజెండాను అమలు చేసే విషయంలో మన్మోహన్‌కు దన్నుగా నిలవాలని కాంగ్రెస్ నిర్ణయించుకుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
దేశంలోని పారిశ్రామిక రంగానికి వూతంగానే ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ''భారత పారిశ్రామిక రంగం వృద్ధికి డబ్బేది?'' అని కేంద్ర సీనియర్ మంత్రి ఒకరు ప్రశ్నించారు. ''ఎఫ్‌డీఐలపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోకపోతే అవి వేరే చోటకు మరలిపోతాయి. ప్రవాస భారతీయులూ ఉపసంహరించుకుంటారు. మన తలుపులు తడుతున్న విదేశీ పెట్టుబడిదార్లలో విశ్వాసం పాదుకొల్పడానికే ఎఫ్‌డీఐలకు తలుపులు తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది. లేదంటే భారత్‌లో పెట్టుబడులకు డబ్బేది?'' అని ఆ మంత్రి ప్రశ్నించారు.

No comments:
Post a Comment