అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...
గ్యాస్‌కు ఆన్‌లైన్ గొళ్లెం
ఇకపై డీలర్ల
వద్ద బుకింగ్ నిలిపివేత
ఆరు సిలిండర్లు
వాడేశాక... ఏడోది బంద్
ఇక ఈ ఏడాదికి
సబ్సిడీపై దక్కేవి మూడే
ఆపై సిలెండర్లను
మార్కెట్ ధరకు కొనాల్సిందే
హైదరాబాద్
- న్యూస్‌టుడే
కేం్రదం
పచ్చజెండా వూపిందే తడవుగా చమురు కంపెనీలు బాదుడు యత్నాలు మొదలుపెట్టాయి.
గ్యాస్ సబ్సిడీని మిగుల్చుకోడానికి రకరకాల ప్రణాళికలను అమలు చేయబోతున్నాయి.
అందరూ ఆన్‌లైన్‌లోనే బుక్ చేసుకునే విధానాన్ని తేవడం... ఆరు సిలిండర్ల
కోటా పూర్తి కాగానే ఆటోమెటిక్‌గా బుకింగ్ లాక్ అయ్యే విధానాన్ని అమలు చేయడం...
ఇలా రకరకాల ఏర్పాట్లతో కంపెనీలు సబ్సిడీ సొమ్ము ఆదాకు ప్రయత్నాలు ప్రారంభించాయి.
వినియోగదారులకు మేలు చేసే అంశాలైతే రకరకాల సాకులతో అమలుకు
వెనుకాడే చమురు సంస్థలకు తమకు సొమ్ము మిగిలే విధానం కనుక వెనువెంటనే
అమల్లోకి తెచ్చి వినియోగదారులకు వాత పెట్టడానికి సిద్ధపడుతున్నాయి.
* ప్రస్తుతం
రాష్ట్రవ్యాప్తంగా వంటగ్యాస్ సిలిండర్ల బుకింగ్‌కు అన్ని చమురు కంపెనీలు ఆన్‌లైన్‌లో
ఏర్పాట్లు చేసినా సగంమందే ఆ విధానాన్ని వాడుతున్నారు. మిగిలినవారు డీలర్ల
దగ్గకు వెళ్లి బుక్ చేసుకుంటున్నారు. ఇకనుంచి తప్పనిసరిగా అందరూ
ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే ఏర్పాట్లను చేయబోతున్నారు. దీనిపై అవగాహన
లేనివారు, గ్రామీణ ప్రాంతాలవారు డీలరు దగ్గరకు వెళితే వారి సెల్‌ఫోన్‌ను
తమ కంపెనీ ఆన్‌లైన్ సెల్‌నెంబర్‌తో అనుసంధానం చేస్తారు. ఇక వినియోగదారు
ఎప్పుడు సిలిండర్ కావాలన్నా చమురు కంపెనీ ఆన్‌లైన్ నెంబరు డయిల్ చేశాక
వినిపించే సూచనలను అనుసరించి నెంబర్లు నొక్కితే సిలిండర్ బుక్ అవుతుంది.
* అలాగే
వినియోగదారులు ఆరు సబ్సిడీ సిలెండర్లు తీసుకున్న తరువాత ఏడోది బుక్
కాకుండా ఆన్‌లైన్‌లోనే లాక్ చేసే విధానాన్ని అమలులోకి తేబోతున్నాయి. రాష్ట్రంలో
1.20 కోట్లమంది వంటగ్యాస్ కనెక్షన్లు ఉండగా ఇందులో 60 లక్షలమంది వరకు గృహ
వినియోగదారులు నెలకు ఒకటి చొప్పున ఏడాదికి 12 నుంచి 13 సిలెండర్ల వరకు
వాడుతున్నారు. వచ్చే ఏప్రిల్ నుంచి ఆరు సిలెండర్లు తీసుకున్న వినియోగదారులు
ఏడో సిలిండర్‌ను బుక్ చేసుకోవడానికి ప్రయత్నిస్తే బుక్ కాకుండా ఏర్పాట్లు
చేస్తున్నారు. ఆరోది బుక్ చేసుకున్నప్పుడే ఆన్‌లైన్‌లో ఈ ఏడాదికి ఇదే చివరిదనే
హెచ్చరిక వస్తుంది... ఆపై ఎన్ని కావలసినా డీలరు దగ్గరకు వెళ్లి రూ.750కు
కొనుక్కోవలసిందే. అంటే ఇక... వారి దయ... మన ప్రాప్తం అన్నట్లే! ఇదే సందుగా
బ్లాక్ మార్కెట్ ఎంతగా విజృంభిస్తుందో ముందుముందు తెలుస్తుంది.
ఆరు ఇప్పటికే
వాడేస్తే మరో మూడే: ఏడాదికి 12 సిలెండర్లు
వాడే కుటుంబాలు రాష్ట్రంలో 60 లక్షల వరకు ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
వీరందరిపై ఏడాదికి అదనంగా రూ.2,100 మేర భారం పడనుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో
ఇప్పటికే ఆరు సబ్సిడీ సిలిండర్లు వాడేసిన వినియోగదారులు దాదాపు 50 లక్షల
వరకు ఉన్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో
ఇప్పటికే ఆరు వాడేసిన వినియోగదారులకు వచ్చే ఆరు నెలలకు అంటే వచ్చే
మార్చి వరకు కేవలం మూడు సబ్సిడీ సిలెండర్లను మాత్రమే ఇస్తారు. అంతకుమించి
కావాలంటే సిలిండర్ రూ.750 కాని, చమురు కంపెనీలు చెప్పిన ధరకు కానీ కొనుక్కోవలసిందే.
కేంద్రం ఆకస్మిక నిర్ణయం వల్ల లక్షలమంది వినియోగదారులకు తిప్పలు తప్పనట్లే!
No comments:
Post a Comment