9/17/2012 1:16:00 AM
సిటీబ్యూరో, న్యూస్‌లైన్: గతమెంతో ఘనం.. కానీ నేడు... సమస్యల సుడిగుండం. చారిత్రక సంపద, ఘన సంస్కృతీ వారసత్వానికి నిలయమైన హైదరాబాద్ ప్రస్థానం అంచెలంచెలుగా సాగింది. నాడు విద్య, వైద్యం, మంచినీరు, పారిశుద్ధ్యం, పట్టణ ప్రణాళిక, అందమైన తోటలతో అలరారిన ‘భాగ్య’నగరం.. ప్రస్తుతం సమస్యలతో రణం...
పెరుగుతోన్న జనాభాకు అనుగుణంగా పెరగని మౌలిక వసతులు సిటీ జీవితాన్ని పిటీగా మార్చేస్తున్నాయి. చాలీచాలని మంచినీరు, డ్రైనేజీ వసతుల లేమి, సర్కారు ‘దగా’ఖానాలు, ఇరుకుదారులు నిత్యనరకం చూపుతున్నాయి. గతంలో సాఫీగా ఎంత దూరమైనా నడచుకుంటూ వెళ్లగలిగే పరిస్థితులుండగా, నేడు అడుగే వేయలేని దుస్థితి. గాలి, నేల, నీరు అన్నీ విషతుల్యంగా మారి జీవనాన్ని నరకప్రాయం చేస్తున్నాయి.
ప్రభం‘జనమే...’!
నాటి జనాభా 1950లలో 10 లక్షలు ఉండగా, 1990 నాటికి 30 లక్షలు, ఆపై అనూహ్యంగా పెరిగింది. గ్రేటర్‌గా.. కోటికి చేరువలో ఉంది. దేశంలోనే ఐదో పెద్ద నగరంగా అవతరించిన హైదరాబాద్.. విద్య, వైద్యం, పారిశ్రామిక, ఐటీ తదితర అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ఉన్నా.. కనీస సదుపాయాల కల్పనలో వెనుకబడింది. విస్తీర్ణం 73 చ.కి.మీ. నుంచి 625 చ.కి.మీ.లకు పెరిగింది. 1960లలో కోటిన్నర మాత్రమే ఉన్న కార్పొరేషన్ ఆదాయం రూ. 600 కోట్లకు చేరింది. కానీ.. సదుపాయాలు, స్వచ్ఛమైన గాలి, ఆహ్లాదాన్నిచ్చే వాతావరణం కరువయ్యాయి. నగరం చుట్టూ పరచుకున్న తోటలు, చెరువులు కనుమరుగయ్యాయి. పట్టణ ప్రణాళిక ఛిన్నాభిన్నమైంది. చెరువులు, శ్మశానాలనే తేడా లేకుండా ఎక్కడపడితే అక్కడ అంతస్తులపై అంతస్తులు లేచాయి. వర్షం వస్తే నీరు వెళ్లే మార్గం లేక బస్తీలే చెరువులవుతున్నాయి. పుట్టగొడుగుల్లా పెరిగిన అపార్ట్‌మెంట్స్.. అడ్దదిడ్డంగా వెలసిన నిర్మాణాలు, అడ్రస్ కనుక్కుందామంటే దొరకని విధంగా నగరం దారి తప్పింది. అభివృద్ధి బాటలో దూసుకుపోతున్న (అ)భాగ్యనగరానికి ఈ సమస్యల నుంచి ‘విమోచనమెప్పుడు’?!
గొంతెండుతోన్న నగరం..
1948 నాటికే నగర మంచినీటి సరఫరాకు పటిష్ట సరఫరా వ్యవస్థ ఏర్పాటైంది. జంట జలాశయాల ద్వారా అప్పట్లోనే రోజుకు 20 మిలియన్ గ్యాలన్ల మంచినీటిని అత్యంత తక్కువ ఖర్చుతో నగరం నలుమూలలకు సరఫరా చేసే వారు. తదనంతరం పెరిగిన జనాభాకు అనుగుణంగా నీటి సరఫరాను పెంపొందించడంలో పాలకులు విఫలమయ్యారు. ‘మంజీరా’, ‘కృష్ణా’ ప్రాజెక్టుల ద్వారా నీటి సరఫరా చేస్తున్నా.. నగర అవసరాలను ఏ మాత్రం తీర్చలేకపోతున్నాయి. శివారుల్లో నివసిస్తున్న 35 లక్షల మంది కన్నీటి కష్టాలు సర్వసాధారణమయ్యాయి.
‘డ్రైనేజీ’లోనే ప్రతిపాదనలు..
నాటి డ్రైనేజీ వ్యవస్థ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. 1931 నాటికే సుమారు 700 కిలోమీటర్ల మేర భూగర్భ డ్రైనేజీ ఏర్పాటైంది. వరదల నివారణకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నిర్వాసితులకు పక్కాఇళ్లు కట్టించారు. మూసీ పరివాహక ప్రాంతంలో చక్కటి ఉద్యానవనాలను తీర్చిదిద్దారు. నాటి జనాభాకు అనుగుణంగా ఏర్పాటైన డ్రైనేజీ వ్యవస్థనే ఇంకా కొనసాగుతోంది. పెరిగిన జనాభాకు అనుగుణంగా డ్రైనేజీ వ్యవస్థను ఆధునికీకరించ లేదు. ఫలితంగా చిన్నపాటి వర్షానికే మహానగరం మురికి కూపమవుతోంది. మురుగుకాల్వల ఆధునికీకరణకు చేసిన ప్రతిపాదనలు బుట్టదాఖలయ్యాయి.
ప్రజా రవాణా అస్తవ్యస్తం..
నాటి హైదరాబాద్ సంస్థానంలో ప్రజా రవాణా వ్యవస్థ చెప్పుకోదగ్గ రీతిలో ఉండేది. 1932లోనే రోడ్‌ట్రాన్స్‌పోర్ట్ డివిజన్‌ను నెలకొల్పారు. నాడు 27 బస్సులు (డబుల్ డెక్కర్) రాజ్యం నలుమూలలకు రాకపోకలు సాగించేవి. ఇపుడు గ్రేటర్ పరిధిలో సుమారు 3500 బస్సులు వెయ్యి రూట్లలో రాకపోకలు సాగిస్తున్నాయి. కానీ, ఇవి ప్రయాణికుల అవసరాలను తీర్చట్లేదు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రజా రవాణా వ్యవస్థ అభివృద్ధి చెందలేదు. నగరంలోని పలు ప్రాంతాలో పాటు శివారు ప్రాంతాలకు పూర్తి స్థాయిలో బస్సు సౌకర్యం అందుబాటులోకి రాలేదు. ఉన్న సిటీ బస్సుల్లోనూ చాలావరకు డొక్కు బస్సులే. ఎంఎంటీఎస్ మొదటి దశ పూర్తి కావడం, రెండో దశ ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తుండడం, ఎలివేటెడ్ మెట్రో పనులు ఊపందుకోవడం ఊరటనిచ్చే అంశం.
చదువు‘కొనాల్సిందే’..!
అప్పట్లో విద్యారంగం వెలుగులీనింది. మహబూబియా కాలేజీ, సిటీ కాలేజీ, హలీయా కాలేజీ, నిజాం కాలేజీ, ఉస్మానియా యూనివర్సిటీ, కోఠి ఉమెన్స్ కాలేజీ.. ఇలా అనేక విద్యాలయాలు నిజాం కాలంలోనే వెలిశాయి. అయితే, విద్యాబోధనలో నేటికీ ఓ వెలుగు వెలుగుతూనే ఉన్నా.. విద్యార్థుల నిష్పత్తికి అనుగుణంగా ప్రభుత్వ కాలేజీలు ఏర్పాటు చేయకపోవడం, ఉన్న వాటిని విస్తరించడంపై పాలకులు నిర్లక్ష్యం చూపారు. ప్రత్యామ్నాయంగా కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు పుట్టుకొచ్చాయి. ప్రస్తుతం హైదరాబాద్ కార్పొరేట్ విద్యకు హబ్‌గా మారింది.
వైద్యం.. కుదేలు!
అప్పట్లో ఆరోగ్య రంగానికి ఎంతో ప్రాధాన్యతనిచ్చారు. నిజాం నవాబుల కాలంలో ఏర్పాటైన ఆస్పత్రులు నేటి ప్రభుత్వాల నిర్లక్ష్యానికి సజీవ సాక్షాలుగా నిలుస్తున్నాయి. కొత్త ఆస్పత్రులు ఏర్పాటు చేయకపోగా ఉన్న వాటిని పట్టించుకోలేదు. ఒక్క గాంధీ ఆస్పత్రి మినహా, ఏ ఆస్పత్రినీ అభివృద్ధి చేయలేదు. ఆస్పత్రులకు వస్తున్న రోగుల నిష్పత్తికి అనుగుణంగా పడకలు పెంచలేదు. పెద్దాస్పత్రి ఉస్మానియా భవనం శిథిలావస్థకు చేరింది. ఎర్రగడ్డ ఛాతి ఆస్పత్రి కూలేందుకు సిద్ధంగా ఉంది. నిలోఫర్‌లో నిత్యం మరణ మృదంగమే. పాతబస్తీ యునానీ, సుల్తాన్‌బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రులది కూడా ఇదే పరిస్థితి.
‘కోతల’ వాతలే..!
తొలినాళ్లలోనే నగరంలో విద్యుత్ రంగం వికసించింది. 1910లోనే హైదరాబాద్ స్టేట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్ ఏర్పాటైంది. 1915 నాటికి సిటీలోని అన్ని వీధుల్లో విద్యుత్ దీపాలంకరణ ఊపందుకుంది. 1930 నాటికే హైదరాబాద్ పూర్తిగా విద్యుద్ధీకరించబడింది. నిరంతరాయంగా విద్యుత్ సరఫరా జరిగేది. కానీ, ప్రస్తుతం విస్తార వనరులు, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నా.. కోతల వాతలు తప్పట్లేదు. గృహాలకు మూడు గంటలు, పరిశ్రమలపై ఆంక్షలు విధించారు. ప్రస్తుతం 34 లక్షల కనెక్షన్లు ఉన్నాయి. వీటి అవసరాల కోసం సుమారు 50 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం కాగా, 35-40 మిలియన్ యూనిట్లకు మించి సరఫరా కావడం లేదు.

No comments:
Post a Comment