అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Sunday, September 9, 2012

రేడియో పాడదు.. ల్యాండ్‌లైన్ మోగదు

జనగణన సర్వేలో ఆసక్తికర విశేషాలు 

హైదరాబాద్, సెప్టెంబర్ 8 : ఆకాశవాణి... వార్తలు చదువుతున్నది కందుకూరి సూర్యనారాయణ! సంపతి వార్తాహ.. సుయాంతాం బలదేవానంద సాగర! నిలయంలో సమయం 12.40 నిమిషాలు. కొన్ని క్షణాల్లో కార్మికుల కార్యక్రమం ప్రసారమవుతుంది! ఉదయాన్నే సూక్తి ముక్తావళితో మొదలుకుని... లలిత సంగీతం, జానపద గేయాలు, పాడి పంట, మీరు కోరిన పాటలు ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలు ఇంటింటా వినిపించేవి! అదేనండీ... రేడియోలో! ఒకప్పుడు రేడియో లేని ఇళ్లు లేదు.

ఇప్పుడు... రేడియో వాడుతున్న ఇళ్లు వెతికి వెతికి పట్టుకున్నా దొరకదు! సెల్‌ఫోన్లలో, కార్లలో ఎఫ్ఎం రేడియో... అది కూడా హైదరాబాద్ కొన్ని నగరాలకే పరిమితం! సంప్రదాయ రేడియో సెట్ మాయమవుతోంది! రాష్ట్రంలో 2.10 కోట్ల నివాసాల నుంచి జనగణన విభాగం సేకరించిన వివరాలను పరిశీలిస్తే ఈ సంగతి స్పష్టమవుతుంది. రేడియోతోపాటు ల్యాండ్‌లైన్ ఫోన్ కూడా పురాతన వస్తువుల జాబితాలో కలిసిపోతున్నట్లు ఈ లెక్కల్లో తేలింది. రాష్ట్రవ్యాప్తంగా కేవలం 9.3 శాతం ఇళ్లలో మాత్రమే ఆకాశవాణి వినిపిస్తోంది. టీవీలు మాత్రం 60 శాతం ఇళ్లలో కనువిందు చేస్తున్నాయి.

అప్పో సప్పో చేసి కలరో బ్లాక్ అండ్ వైటో టీవీ కొని చూసేవాళ్లే కనిపిస్తున్నారు. సెల్ హల్‌చల్‌కు ల్యాండ్‌లైన్ ఫోన్‌కు గ్రహణం పట్టింది. రాష్ట్రంలో కేవలం నాలుగు శాతం ఇళ్లలో మాత్రమే ల్యాండ్‌లైన్లు ట్రింగుట్రింగుమంటున్నాయి. హైదరాబాద్ జిల్లాలో సైతం కేవలం పది శాతం ఇళ్లలోనే ల్యాండ్‌ఫోన్లు ఉన్నాయి. ఒకప్పుడు మంచి ఆదాయ మార్గంగా ఉన్న టెలిఫోన్ బూత్‌లు, ఆ తర్వాత రూపాయితో సందడి చేసిన కాయిన్ బాక్సులు కంటికి కరువయ్యాయి. రోజుకూలీ నుంచి కోట్లకు పడగలెత్తిన వారి వరకు... అందరూ సెల్‌ఫోనే వాడుతున్నారు. దీంతో ల్యాండ్‌లైన్ పురాతన వస్తువుగా మారుతోంది. 

No comments:

Post a Comment