- జమలాపురపు విఠల్‌రావు
21/09/2012
అక్టోబర్ 1 నుంచి 19 వరకు కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ (సిఒపి)ల జీవ వైవిధ్య సద స్సు (సిబిడి)కు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ తరహా అంతర్జాతీయ సదస్సును మనదేశంలో నిర్వహించడం గత అరవయ్యేళ్ళలో ఇదే ప్రథమం. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరం పదకొండవ జీవ వైవిధ్య సదస్సుకు
ఆతిథ్యమిచ్చేందుకు సమాయత్తమవుతోంది. ఈ సదస్సు మొత్తం మూడు భాగాలుగా జరుగుతుంది. జీవవైవిధ్యంపై కార్టజిన ప్రొటొకాల్‌పై సభ్య దేశాల మధ్య చర్చలు అక్టోబర్ 1 నుంచి 5వ తేదీ వరకు కొనసాగనుండగా, అక్టోబర్ 8 నుంచి 19 వరకు 11వ సిఒపి సమావేశం జరుగుతుంది. ఇందులో 17-19 వరకు జరిగేది ఉన్నత స్థాయి సదస్సు.
ఈ జీవవైవిధ్య సదస్సులో సంతకాలు చేసిన మొత్తం 194దేశాలకు చెందిన ఎనిమిదివేల నుంచి పదివేల వరకు ప్రతినిధులు పాల్గొంటారు. 90-100 మంది వివిధ దేశాల అధ్యక్షులు, ప్రధానులు మరో పది దేశాలకు చెందిన మంత్రులు హాజరయ్యే అతిపెద్ద సదస్సు ఇది. ఐక్యరాజ్య సమితి సెక్రెటేరియట్ కనె్వన్షన్ ఆన్ బయోడైవర్సిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బ్రౌలియో ఫెరిర్రా డిసౌజా డియాస్ కూడా ఈ సదస్సులో పాల్గొంటారు. ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు, యుఎన్ పర్యావరణ కార్యక్రమ డైరెక్టర్‌లు కూడా హాజరయ్యే అవకాశముంది.అమెరికా జీవ వైవిధ్య సదస్సు ఒప్పందంపై సంతకాలు చేయనప్పటికీ, ఆ దేశ ప్రతినిధి బృందం కూడా సదస్సులోపాల్గొనబోతున్నది.
నిజానికి హైదరాబాద్‌లో జీవవైవిధ్య సదస్సుకు ఏర్పాట్లు గత ఏడాదినుండే ప్రారంభమయ్యాయి.మొత్తం పదిహేను ఎకరాల్లో జీవ వైవిధ్య కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ జీవ వైవిధ్యాన్నివివరించే పైలాన్‌ను కూడా ఏర్పాటు చేశారు. దీన్ని అక్టోబర్ 16న ఆవిష్కరిస్తారు. కాంప్లెక్స్‌లో జీవవైవిధ్య పార్కు, ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నారు. రాబోయే కాలంలో ఈ జీవవైవిధ్య మ్యూజియంలో సూక్ష్మ జీవులతో సహా 13 లక్షల జంతు, వృక్ష జాతులను ఏర్పాటుచేయాలనేది నిర్వాసకుల ఆలోచన.

-
అంతే కాదు నగర జీవవైవిధ్య
సూచికను ఏర్పాటు చేస్తారు.
కాలుష్యాన్ని తగ్గించాలంటే,
పచ్చదనాన్ని మరింతగా
విస్తరింపజేయాలి. ఇందుకోసం
గృహిణులు, పిల్లలు వివిధ
భాగస్వాముల్లో చైతన్యం
తీసుకొచ్చేందుకు అవసరమైన
కార్యక్రమాలను చేపడతారు.
రాబందులు, ఊరపిచ్చుకలు,
పాములు, గాడిదలు
అంతరించిపోయే ప్రమాదం అంచున
ఉన్న జంతు జాతులుగా గుర్తించారు.
అక్టోబర్ 9 నుంచి 19 వరకు జేమ్స్
స్ట్రీట్ రైల్వే స్టేషన్‌లో జీవవైవిధ్యానికి
సంబంధించిన ప్రత్యేక ఎక్స్‌ప్రెస్
రైలును నిలుపుతారు.
శిల్పారామంలో సంప్రదాయ
వృత్తులను, కోతల సమయంలో చేసే
నృత్యాలను ప్రదర్శిస్తారు. సిఒపి లోగో
మరియు భాగస్వామ్య దేశాల
పతాకాలతో కూడిన దీపాలను
ప్రదర్శిస్తారు.
సదస్సులో సభ్య దేశాల ప్రతినిధుల
మధ్య పర్యాలోచన ముగిసిన
తర్వాత, హైదరాబాద్ ప్రకటన
వెలువడుతుంది. వాటర్ హార్వెస్టింగ్,
మొక్కలు నాటడం, సేంద్రీయ
వ్యవసాయం, ఔషధ మొక్కలు వంటి
జీవవైవిధ్యానికి, జీవన భృతులకు
అవసరమైన అంశాలను ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వం ప్రదర్శిస్తుంది. ఈ సదస్సు
వల్ల మన రాష్ట్రానికి జరగబోయే
లాభాలేంటంటే సంప్రదాయ పరిజ్ఞానం
వెలుగులోకి రావడం,
పర్యాకాభివృద్ధికి ప్రోత్సా హం
లభిస్తుంది. ఈ సందర్భంగా మన
రాష్ట్ర అటవీ ఉత్పత్తులను ప్రదర్శనకు
పెట్టవచ్చు. 10వ సిఒపి జరిగిన
జపాన్‌లోని నగోయా మాదిరిగానే,
హైదరాబాద్‌కు కూడా ప్రపంచ
వ్యాప్తంగా మంచి గుర్తింపు
లభిస్తుంది.
1993లో అమల్లోకి..
1992లో రియో డి జెనైరోలో
జరిగిన ధరిత్రీ సదస్సు సందర్భంగా
జీవ వైవిధ్య సదస్సు (సిబిడి)పై
సంతకాలు జరగడం ప్రారంభమైంది.
ఇది 1993 డిసెంబర్ నుంచి
అమల్లోకి వచ్చింది. సిబిడి అనేది
జీవవైవిధ్యంపై కుదిరిన అంతర్జాతీయ
ఒప్పందం. జీవవైవిధ్యంలోని
వౌలికాంశాలను సుస్థిరంగా
వినియోగించుకుంటూ, జన్యు
వనరులనుంచి పొందే లాభాలను
అంతా సమానంగా అనుభవించడం
దీని ముఖ్యోద్దేశం. ఇప్పటి వరకు ఈ
ఒప్పందంపై 194 దేశాలు
సంతకాలు చేశాయి. అంటే
ప్రపంచంలోని అధికమొత్తంలో
దేశాలు ఇందులో భాగస్వాములైనట్టే.
జీవవైవిధ్యానికి, వివిధ
జీవావరణాలకు ఎదురవుతున్న
ప్రమాదాల గురించి ఈ సదస్సులో
చర్చిస్తారు. ముఖ్యంగా పర్యావరణ
మార్పులపై శాస్ర్తియ అంచనాలను,
ఉపకరణాలను వృద్ధి
చేయడం,ప్రోత్సాహకాలు,
విధానాలు,సాంకేతిక పరిజ్ఞాన
బదలాయిం పు, ఉత్తమ విధానాలను
అనుసరించడం, స్థానిక, ప్రాంతీయ
సమాజాలు, యువత, మహిళలు,
స్వచ్ఛంద సంస్థలు, వ్యాపారులతో
సహా నిజమైన భాగస్వాములకు
ఇందు లో స్థానం కల్పిస్తారు.
కార్టజినా ప్రొటొకాల్
జీవ సురక్షితత్వంపై కార్టజినా
ప్రొటొకాల్, జీవవైవిధ్య సదస్సుకు
ఉప-ఒప్పందం. ఆధునిక జీవ
సాంకేతిక పరిజ్ఞానం కారణంగా
మార్పులు చోటు చేసుకున్న జీవుల
కారణంగా చోటు చేసుకునే
ప్రమాదాలనుంచి, జీవవైవిధ్యాన్ని
కాపాడాలని కార్టజినా ప్రొటొకాల్
స్పష్టం చేస్తున్నది. ఈ ప్రొటొకాల్‌ను
మొత్తం 159 దేశాలు మరియు
ఐరోపా సమాజ దేశాలు
ఆమోదించాయి. 2000 జనవరి
9న దీన్ని ఆమోదించగా 2003
సెప్టెంబర్ 11 నుంచి అమల్లోకి
వచ్చింది.
సిఒపి పాలనా విభాగం..
కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ (సిఒపి)
అనేది సదస్సుకు చెందిన పాలనా
విభాగం. నిర్ణీత కాలాల్లో జరిపే
సమావేశాల ద్వారా సదస్సులో
తీసుకున్న నిర్ణయాలను అమలు
జరుపుతూ మరింత ముందుకు
తీసుకెళుతుంది. ఇప్పటి వరకు
సిఒపి పది సాధారణ సమావేశాలతో
పాటు మరో అసాధారణ సమావేశాన్ని
నిర్వహించింది. 1994 నుంచి
1996 వరకు సిఒపి సమావేశాలు
వార్షికంగా జరిగాయి. అటు తర్వాత
ఈ సమావేశాలు కాలావధి పెరిగింది.
ముఖ్యంగా 2000 సంవత్సరంలో
ఈ సమావేశాలకు సంబంధించిన విధి
విధానాల్లో మార్పులు తీసుకొని
రావడంతో అప్పటినుంచి ప్రతి
రెండేళ్ళకోమారు సిఒపి
సమావేశమవుతోంది. ఇప్పటి వరకు
సిఒపి జరిపిన సమావేశాల
సందర్భంగా మొత్తం 299 వౌలిక,
విధానపరమైన నిర్ణయాలు
తీసుకుంది. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్
పదో సదస్సు జపాన్‌లోని నగోయాలో
2010 అక్టోబర్ 18-29 తేదీల
మధ్య జరిగింది. ప్రస్తుతం
హైదరాబాద్‌లో జరుగనున్నది 11వ
సిఒపి సదస్సు!
వివిధ వృక్ష జంతు జాతులు
అంతరించి పోవడాన్ని గుర్తించిన
ఐక్యరాజ్య సమితి పర్యావరణ
కార్యక్రమం (యుఎన్‌ఇపి),
1988లో జీవవైవిధ్యంపై
నిపుణులతో కూడిన ఒక అడ్ హాక్
వర్కింగ్ గ్రూపును ఏర్పాటు చేసింది.
జీవవైవిధ్యంపై అంతర్జాతీయ
సదస్సును ఏర్పాటు చేసే
అవకాశాలను అనే్వషించడమే ఈ
వర్కింగ్ గ్రూపు పని. తర్వాత
1989 మేనెలలో న్యాయ మరియు
సాంకేతిక నిపుణులతో కూడిన మరో
వర్కింగ్ గ్రూపును ఏర్పాటు చేసింది.
జీవ వైవిధ్యాన్ని సుస్థిరంగా
వినియోగించుకునేందుకు అనువుగా
అంతర్జాతీయ న్యాయ ఉపకరణాన్ని
రూపొందించడం ఈ వర్కింగ్ గ్రూపు
ప్రధాన విధి. అందుకయ్యే పెట్టుబడి,
లాభాలను వర్ధమాన, అభివృద్ధి
చెందిన దేశాల మధ్య ఏవిధంగా
పంపిణీ చేయాలన్న దానిపై ఈ
గ్రూపు దృష్టి కేంద్రీకరించింది. ఇదే
సమయంలో స్థానిక ప్రజల
మద్దతును ఏవిధంగా సాధించాలనే
దానిపై కూడా అధ్యయనం చేసింది.
1991 పిబ్రవరి నాటికి ఇదే వర్కింగ్
గ్రూపు ‘అంతర ప్రభుత్వ చర్చల
గ్రూపు’గా రూపాంతరం చెందింది.
జీవవైవిధ్య సదస్సుపై రూపొందించిన
ముసాయిదాను, ఆమోదించడం
కోసం 1992 మే నెలలో నైరోబీలో
ఒక సమావేశం జరిగింది. అందులో
ముసాయిదాను ఆమోదించడం ఈ
కమిటీ కృషికి పరాకాష్ఠగా
చెప్పవచ్చు. పర్యావరణం మరియు
అభివృద్ధిపై ఐక్యరాజ్య సమితి సదస్సు
(రియో ‘్ధరిత్రీ సదస్సు’) 1992
జూన్ 5న జరిగింది. ఈ సందర్భంగా
జీవ వైవిధ్య సదస్సుపై సంతకాల
సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఆవిధంగా 1993 జూన్ 4వ తేదీ
వరకు సంతకాలు చేయడానికి
అవకాశం కల్పించారు. అప్పటికి
దీనిపై 168 దేశాలు సంతకాలు
చేసాయి. తొంబయవ రోజున అంటే
1993 డిసెంబర్ 29 నుంచి ఇది
అమల్లోకి వచ్చింది. ఆ తర్వాత
మొట్టమొదటి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్
(సిఒపి) 1994, నవంబర్ 28
నుంచి డిసెంబర్ 9 వరకు
బహమాస్‌లో నిర్వహించాలని
నిర్ణయించారు. కాగా పదవ సిఒపి
సమావేశం జపాన్‌లోని నగొయా,
అయచి ఫ్రిఫెక్చర్‌లో 2010
అక్టోబర్ 18 నుంచి 29 వరకు
నిర్వహించారు. ఈ సందర్భంగా జీవ
వైవిధ్యంపై సవరించిన నూతన
వ్యూహాత్మక ప్రణాళికను
ప్రకటించారు. దీనే్న 2011-
2020 వరకు అయచి జీవ వైవిధ్య
లక్ష్యాలుగా వ్యవహరిస్తున్నారు. ఈ
ప్రణాళిక ప్రకారం, సభ్య దేశాలు తమ
ఐదవ జాతీయ నివేదికలను
2014 మార్చి 31 లోగా
సమర్పించాల్సి ఉంది. 2020
నాటికి అయచి జీవ వైవిధ్య
లక్ష్యాలను చేరుకునేందుకు వీలుగా,
తమ ప్రణాళికలను ఆయా దేశాలు
సమర్పించాలి. ఏది ఏమైనా ఈ
ధరిత్రిపై జీవవైవిధ్యాన్ని
కాపాడినప్పుడే మానవాళి మనుగడ
సాధ్య మని, ప్రకృతిని
పరిరక్షించడంలోనే సకల జీవరాశుల
ఉనికిఆధారపడి ఉన్నదనేది నగ్న
సత్యం.
==================
లోగో
లోగోపై చిత్రించిన పెద్దపులి, డాల్ఫిన్,
పక్షి, ఆహార ధాన్యంతో మహిళ
చిత్రాలు జీవవైవిధ్యం-జీవనానికి
మధ్య సంబంధాన్ని చూపే జీవిత
చక్రానికి చక్కటి నిదర్శనం.
సిఒపి లోగోను అహ్మదాబాద్‌కు
చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్
డిజైన్ సంస్థ వారు, కేంద్ర అటవీ
మరియు పర్యావరణ మంత్రిత్వశాఖ
కోసం ప్రత్యేకంగా రూపొందించారు.
ఈ లోగో రూపకల్పనలో సిఒపి-10
సదస్సు లోగో స్ఫూర్తి దాగివుంది.
లోగో పై భాగంలో ‘ ప్రకృతిః రక్షతి
రక్షితా’ అనే సంస్కృత నినాదాన్ని
ఉంచారు.
No comments:
Post a Comment