అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Saturday, November 3, 2012

గ్రేటర్‌పై సర్‌చార్జి భారం రూ.475.2 కోట్లు

11/3/2012 2:01:00 AM
సిటీబ్యూరో, న్యూస్‌లైన్: విద్యుత్ బిల్లులు పట్టుకుంటే చాలు.. షాక్ కొట్టనున్నాయి. ఇప్పటికే కోతలతో అల్లాడుతున్న నగరవాసులపై తాజా గా సర్‌చార్జీల వాత.. 2012 ఏప్రిల్, మే, జూన్ నెలల్లో వాడిన విద్యుత్‌కు ఇంధన సర్దుబాటు వ్యయం (సర్‌చార్జి) రూపంలో యూనిట్‌కు రూ. 1.32 పైసల చొప్పున నవంబర్ నుంచి వసూలు చేసేందుకు ఈఆర్‌సీ శుక్రవారం రాత్రి అనుమతినిచ్చింది. గ్రేటర్‌లో సుమారు 34 లక్షల విద్యు త్ కనెక్షన్లు ఉండగా, ఏప్రిల్, మే, జూన్ నెలల్లో రోజుకు సగటున 40 మిలియన్ యూనిట్ల విద్యు త్ వినియోగమైంది. ఇంధన సర్దుబాటు వ్యయం వసూల్లో భాగంగా వినియోగదారులపై రోజుకు రూ.5.28 కోట్ల భారం పడుతుండగా, నెలకు రూ.158.40 కోట్ల చొప్పున, మూడు నెలలకు కలిపి మొత్తం రూ.475.2 కోట్లకుపైగా అదనపు భారం పడనుంది.

No comments:

Post a Comment