అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Wednesday, May 2, 2012

ఫలించని వేలిముద్రల ప్రయోగం

బయో మెట్రిక్‌ కార్డులిచ్చినా రంగారెడ్డిలో ఆదాకాని రేషన్‌ బియ్యం
హైదరాబాద్‌ - న్యూస్‌టుడే
యోమెట్రిక్‌ యంత్రాలతో వేలిముద్రల ఆధారంగా రేషన్‌ వస్తువులను సరఫరా చేయాలన్న ప్రయోగాత్మక ప్రాజెక్టు విఫలమైంది. మూడు జిల్లాల్లో ప్రాజెక్టు తలపెడితే రెండు జిల్లాల్లో ప్రారంభమే కాలేదు. మరో జిల్లాలో కార్డుల జారీలోనే పెద్దఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయి. రాష్ట్రంలో 2.25 కోట్ల తెల్లకార్డులు ఉన్నాయి. ఇందులో భారీ ఎత్తున బోగస్‌ కార్డులు ఉండటంతో రేషన్‌ పంపిణీలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. లక్షల సంఖ్యలో కార్డులు డీలర్ల దగ్గర ఉన్నాయి. అక్రమాలను నిరోధించడానికి బయోమెట్రిక్‌ యంత్రాలతో వేలిముద్రలను సరిచూసి రేషన్‌ ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. చిత్తూరు, పశ్చిమ గోదావరి, రంగారెడ్డి జిల్లాల్లోని మూడు మండలాల్లో ఎంపిక చేసిన కొన్ని గ్రామాల్లో ప్రయోగాత్మకంగా చేపట్టాలని నిర్ణయించారు. చిత్తూరు జిల్లా గుడిపాల మండలం సీఎం ఖండ్రిగ, చుక్కా వారిపాలెం, రామభద్రపురం, దాయంవారిపల్లె గ్రామాల్లో తెల్లకార్డులు ఉన్నవారందరికీ ప్రైవేటు సంస్థ ద్వారా బయోమెట్రిక్‌ కార్డులను పంపిణీ చేశారు. పంచింగ్‌ యంత్రాలను కూడా తెచ్చారు. వచ్చిన వారం రోజులకే ఇవి పాడయ్యాయి. మరమ్మతుల కోసం హైదరాబాద్‌కు పంపించారు. ఏడాది నుంచి మిషన్లు తిరిగి రాలేదు. దీంతో ఇక్కడ బయోట్రిక్‌ పథకాన్ని ఇప్పటివరకు ప్రారంభించలేదు. పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు మండలంలో కొన్ని గ్రామాల పరిధిలో మొదలు పెడుతున్నట్లు ప్రకటించినా అమలులోకి తేలేదు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలమంతా ఏడాది కిందట ఆధార్‌ వివరాలతో బయోమెట్రిక్‌ కార్డులను జారీ చేశారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో భారీ అక్రమాలు జరిగాయి. అధికారులు డీలర్లు కుమ్మక్కయి బయోమెట్రిక్‌ కార్డులోని వివరాలను అక్రమంగా నమోదు చేశారు. ఒక తెల్ల కార్డుకు సంబంధించి అయిదుగురు కుటుంబ సభ్యులు ఉంటే ఒక్కరో ఇద్దరో వివరాలను నమోదు చేశారు. మిగిలిన ముగ్గురి వివరాలను తోచినట్లు చేర్చారు. అనేక రకాల అక్రమాలు చోటు చేసుకున్నట్లు పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులు గుర్తించారు. బయోమెట్రిక్‌ కార్డులతో 30 శాతం రేషన్‌ ఆదా అవుతుందని తొలుత అంచనా వేశారు. మహేశ్వరం మండలంలో బయోమెట్రిక్‌ వచ్చాక అక్రమాలకు అడ్డుపడలేదు. బియ్యం ఏ మాత్రం ఆదా కావడం లేదు. ప్రయోగాత్మక పథకంపై ఇప్పటికే కోట్ల రూపాయలు వృథా వ్యయం చేశారు. తొలి ప్రాజెక్టు విఫలమైనా మరో మూడు జిల్లాల్లో ఆధార్‌ వివరాలను తీసుకుని, కేంద్ర ప్రభుత్వం నిధులతో బయోమెట్రిక్‌ విధానాన్ని అమలు చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

No comments:

Post a Comment