అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Friday, May 4, 2012

జిల్లాకు అయిదు పీహెచ్‌సీలు



మూడు విడతల్లో నిర్మాణాలు
మొదట శ్రీగిరిపల్లి, రామక్కపేటలలో..
గజ్వేల్‌ టౌన్‌ : జిల్లాకు కొత్తగా అయిదు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మంజూరయ్యాయి. ఇందుకు సంబంధించి గత నెల 4న వైద్య ఆరోగ్య శాఖ జీవో (ఎంఎస్‌ 77/2012)ను విడుదల చేయగా రెండ్రోజుల కిందటే అది జిల్లాకు వచ్చింది. దీంతో ఆరోగ్య కేంద్రాల కోసం అయిదు సంవత్సరాలుగా అధికారులు పంపిన ప్రతిపాదనలకు ఎట్టకేలకు మోక్షం లభించినట్త్లెంది. 30 లక్షల పైగా ఉన్న జిల్లా జనాభాకు ప్రస్తుతం 67 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. కొన్నిచోట్ల జనాభా ప్రాతిపదికన లేకపోవడంతో ప్రభుత్వ వైద్యం పేదలకు అందని ద్రాక్షగా మారింది. ఈ నేపథ్యంలో కొత్తగా పీహెచ్‌సీల ఏర్పాటు అనివార్యమైంది. మూడేళ్లలో
కొత్తగా మంజూరైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను మూడు విడతల్లో నిర్మాణం చేపట్టనున్నారు. 2012-13లో గజ్వేల్‌ మండలం శ్రీగిరిపల్లి, దుబ్బాక మండలం రామక్కపేట, 2013- 14లో జిన్నారం మండలం బొల్లారం, నారాయణఖేడ్‌ మండలం తుర్కపల్లి, 2014-15లో నంగునూరు మండలం చిన్నకోడూర్‌లో ఏర్పాటు చేయనున్నారు. ఈ విషయాన్ని జిల్లా వైద్యాధికారి డా.రంగారెడ్డి ధ్రువీకరించారు. ఏపీ వైద్య మౌలిక సదుపాయల కల్పన సంస్థఆధ్వర్యంలో భవనాలు నిర్మించిన తర్వాత వైద్య సేవలు ప్రారంభమవుతాయన్నారు.

No comments:

Post a Comment