పంచాయతీల ఆధ్వర్యంలో నడిచే వాటికీ ఇబ్బందులే
తూర్పు రంగారెడ్డి, న్యూస్‌టుడే:
* ఇబ్రహీంపట్నంలో మొదట్లో ప్లాంట్ ఏర్పాటు చేసిన వారిలో యాదయ్య ఒకరు. నాలుగేళ్లుగా ప్లాంట్ ఏ ఇబ్బంది లేకుండా నడుస్తోంది. పలువురికి ఉపాధి కూడా చూపిస్తున్నాడు. తొలుత ఏర్పాటు చేసిన స్థలంలో బోర్లు ఎండిపోవడంతో మరోచోట బోర్లు వేసి ప్లాంట్‌ను అక్కడికి మార్చాడు. వెయ్యి అడుగుల లోతు వరకు బోరు వేయించాడు. వస్తున్న నీటిని చూసి ఇబ్బంది లేదనుకున్నాడు. ఇటీవల ఒక్కసారిగా నీటిమట్టం తగ్గడంతో అతని పరిస్థితి సందిగ్ధంలో పడింది.
* ఇబ్రహీంపట్నంలో తక్కువ ధరకు శుద్ధి చేసిన నీటిని సరఫరా చేసేందుకు డాక్టర్ వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. బోరు ఎండిపోవడంతో దాన్ని మూత పెట్టారు.
* జిల్లాలో భూగర్భ జలమట్టం దారుణంగా 14.81 అడుగుల లోతుకు పడిపోయింది. 108కి పైగా గ్రామాలు అత్యంత ప్రమాదకర పరిస్థితికి చేరాయి. దీంతో నీటి కరవు ఏర్పడుతోంది.
* ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాల్లోని అధిక గ్రామాలకు కృష్ణా నీటిని సరఫరా చేస్తున్నారు. ఆ నీరు కలుషితం కాకుండా సరఫరా చేస్తే చాలావరకు రక్షిత నీరు అందుతుంది. ఎక్కడా నమ్మకంగా అందడంలేదు. బోరు నీటితో కలిపి కొన్నిచోట్ల, లీకేజీలతో మరికొన్ని చోట్ల కలుషితం అవుతున్నాయి.
కరవుతో తాగునీటికి కష్టాలొచ్చాయి. నీటిశుద్ధి ప్లాంట్లు నీటి కొరతతో మూత పడుతున్నాయి. రూ.లక్షలు ఖర్చు చేసి ఏర్పాటు చేసుకున్న వారు నీటి కోసం ఎన్ని బోర్లు వేసినా ఫలితం లేక అల్లాడుతున్నారు. ఉపాధి దెబ్బతింటోందని వాపోతున్నారు. జిల్లాలో 12 వందల వరకు ప్లాంట్లు ఉండగా అందులో ఏప్రిల్ చివరి నాటికి 100 వరకు మూతపడ్డాయి. మరికొందరు ఎలాగోలా నీటిని తెచ్చి శుద్ధిచేసి అమ్ముకుంటున్నారు. ఎండలు మండుతుండటంతో శుద్ధినీటికి డిమాండ్ బాగా పెరిగింది. గతం కంటే మూడింతల అమ్మకాలు జరుగుతున్నాయి. మారుమూల పల్లెల్లో సైతం శుద్ధినీటికి తాగడానికి జనం మొగ్గుచూపుతున్నారు. ప్రభుత్వం రక్షితజలం అందించడంలో విఫలం కావడంతో శుద్ధినీటికి ప్రాధాన్యం పెరిగింది. జల, వాయు కాలుష్యంవిపరీతంగా పెరగడంతో తాగునీటి విషయంలో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా అంటురోగాలు ప్రబలుతున్నాయి. అందుకే అనేక కుటుంబాల వారునెలకు రూ.300-600 వరకు శుద్ధి నీటి కోసం ఖర్చు చేస్తున్నారు. ఇంతగా ప్రాధాన్యం పెరిగిన నేపథ్యంలో భూగర్భజలాలు అడుగంటినీటిశుద్ధి ప్లాంట్లు ఏర్పాటు చేసుకున్న వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
No comments:
Post a Comment