అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Friday, February 3, 2012

రానున్నది పోరాటాల కాలం


హరికిషన్‌సింగ్‌ సూర్జిత్‌ నగర్‌ (ఖమ్మం) నుండి ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి :  
Fri, 3 Feb 2012, IST

  • ఆత్మవిశ్వాసంతో ముందడుగు 
  • సిపిఎం రాజకీయ నిర్మాణ నివేదికలో రాఘవులు

రాబోయే కాలమంతా పోరాటాల కాలమేనని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు అన్నారు, ఆ పార్టీ 23వ రాష్ట్ర మహాసభ ఖమ్మంలోని హరికిషన్‌సింగ్‌ సూర్జిత్‌నగర్‌ (భక్తరామదాస్‌ కళాక్షేత్రం)లో గురువార మధ్యాహ్నం
ప్రారంభమైంది. ఈ సందర్భంగా రాజకీయ నిర్మాణ నివేదిక ముసాయిదాను ఆయన ప్రవేశపెట్టారు. ప్రైవేటీకరణ, సంస్కరణల మోజులో ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజానీకంపై పెద్దఎత్తున భారాలు మోపడానికి సిద్దమౌతున్నాయని ఆయన అన్నారు. విద్యుత్‌ భారాలు, వ్యాట్‌ పన్నులతోపాటు తాగు,సాగునీటి రంగ సంస్కరణలు ప్రజానీకంపై తీవ్ర ప్రభావం చూపనున్నాయని చెప్పారు. దీంతో అనివార్యంగా పోరాటల బాట పట్టే ప్రజానీకానికి సిపిఎం శ్రేణులు అండగా నిలవాలని అన్నారు. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయడం ద్వారా ప్రజలను ఐక్యం చేయాలని, పోరాటాలను ఉధృతం చేయాలని అన్నారు. పార్టీ విస్తరణకు, ప్రజల్లో పార్టీ పునాదిని పెంచుకోవడానికి రానున్న రోజులు అనుకూలంగా ఉంటాయని అన్నారు. అదే సమయంలో ఇతర వామపక్షపార్టీలతో కలిసి ఐక్యఉద్యమాలకు, కార్యాచరణకు సిద్దం కావాలని చెప్పారు. 2008 ఫిబ్రవరిలో జరిగిన 22వ మహాసభ నాటికి కాంగ్రెస్‌కు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అన్నారు సామ దాన భేద దండోపాయాలనులలఉపయోగించి ప్రతిపక్షాలను బలహీన పరిచేందుకు ఆ పార్టీ తీవ్రంగా ప్రయత్నించిందని చెప్పారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయపరిస్థితులు కూడా అదేవిధంగాఉన్నాయన్నారు.తెలంగాణాలో ప్రత్యేకవాదం, సీమాంధ్రలో సమైఖ్యవాదం ముందుకొచ్చాయన్నారు. వీటిపై రాష్ట్రంలో అన్ని పార్టీలు అవకాశవాద ధోరణి అవటంభించగా ఒక్క సిపిఎం మాత్రమే స్పష్టమైన సూత్రబద్దవైఖరిని తీసుకుందని తెలిపారు. అననుకూల వాతావరణం ఉన్నప్పటికీ ప్రజల సమస్యలపై ఎక్కడికక్కడ పోరాటాలు నిర్వహించినందున చాలా ప్రాంతాల్లో పార్టీ విస్తరించిందన్నారు. ప్రజా సమస్యలు, ముఖ్యంగా స్థానిక సమస్యలపై కేంద్రీకరించి పని చేయడం వల్లనే ఇది సాధ్యమైందని చెప్పారు. అసంఘటిత రంగ కార్మికుల సమస్యలపరిష్కార కోసం పెద్దఎత్తున పోరాటాలు జరిగాయని తెలిపారు. గ్రామసేవకులు, అంగన్‌వాడీ వర్కర్లు, బీడి,ఆశా, మధ్యాహ్నాభోజన కార్మికులు,108,104 ఉద్యోగుల పోరాటాలను ఆయన ప్రస్తావించారు. ట్రేడ్‌యూనియన్‌ రంగంలో నిరంతరం పోరాటాలు జరిగాయని అన్నారు. ఉపాధిహామీ చట్టం పనులు సాధించడానికి, బకాయిలు రాబట్టుకోవడానికి వ్యవసాయ కార్మికులు, పేద రైతులు పెద్దఎత్తున ఉద్యమించారని చెప్పారు.మద్దతుధరల సాధనకు, కరువు, వరద బాధిత ప్రజానీకాన్ని ఆదుకోవాలని, ఇతర రైతాంగ సమస్యల పరిష్కారం కోస చేసిన పోరాటాలను వివరించారు. ఇటీవల కాలంలో ఎన్నడూ లేని విధంగా కౌలురైతులను సమస్యలను అజెండాలోకి తేవడంలో పార్టీ శ్రేణులు సఫలీకృతమయ్యాయని తెలిపారు. కౌలుదారులను కదిలించి పోరాటాల్లోకి తీసుకురాగలిగామని అన్నారు. అవుట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చేసిన కృషి ఆ రంగంలో ఉద్యమ విస్తృతికి ఉపయోగపడుతోందని అన్నారు. పట్టణ ప్రాంతాల్లో ఆస్థి,నీటిపన్నుల భారానికి వ్యతిరేకంగా ప్రజలను సంఘటితం చేయడానికి పెద్దఎత్తున కృషి జరుగుతోందని తెలిపారు. మధ్యతరగతి ప్రజలు ఈ పోరాటాల్లో భాగస్వాములుఅవుతున్నారని వివరించారు. మహిళల సమస్యలకు సంబంధించి కూడా ఇదే స్ఫూర్తితో పార్టీ శ్రేణులు కదిలాయని అన్నారు. మహిళల హక్కుల కోసం పోరాడటంతో పాటు, వేధింపులకు వ్యతిరేకంగా పోరాడగలిగామని అన్నారు. అదే విధంగా ఎస్సీ,ఎస్టీ, ఇతర బలహీనవర్గాలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ఆందోళనలు సాగించామని అన్నారు. ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్‌ అమలుకోసం, నోడల్‌ ఏజెన్సీ ద్వారా నిధులు ఖర్చు చేయాలని రాష్ట్ర రాజధానిలో నిరాహారదీక్షలతో పాటు అన్ని జిల్లా,మండల కేంద్రాల్లో వివిధ రూపాల్లో ఆందోళనలు సాగించామన్నారు. తద్వారా దళితులు. గిరిజనుల్లో పనిచేస్తున్న వివిధ సంఘాలు, సంస్థలు ఈ ఉద్యమానికి కలిసివస్తున్నాయని అన్నారు. దీనిని మరింత విస్తృతం చేయాలని సూచించారు.బాక్సైట్‌ మైనింగ్‌, థర్మల్‌ విద్యుత్‌ ప్రాజెక్టులు, సెజ్‌ల ఏర్పాటుతో సర్కారు ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోందన్నారు. బాధిత ప్రజానీకాన్ని సమీకరించి నిలకడగా ఉద్యమాలు సాగించామని ఆ కృషిని మరింత పటిష్టంగా కొనసాగించాలని అన్నారు.

అదే సమయంలో క్షేత్రస్థాయిలో పార్టీని పటిష్టపరచడానికి కృషి చేయాలని అన్నారు. వివిధ వర్గాలు తరగతులకు చెందిన ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలపై ఎక్కడికక్కడే స్థానికంగా ఫలితం సాధించుకునేవిధంగా ఆందోళనాపోరాటాలు సాగించాలన్నారు. వర్గ, ప్రజాసంఘాలను పటిష్టపరిచాలని, వాటిని మరింత విస్తృత పరచాలని చెప్పారు. క్షేత్రస్థాయిదాకా విస్తరించడం ద్వారా పార్టీ ప్రతిష్టను మరింతగా ముందుకు తీసుకుపోవాలని సూచించారు. ప్రజాసంఘాల ద్వారా ప్రజలను సమీకరించడం, వారికి ఎప్పటికప్పుడు రాజకీయ చైతన్యాన్ని అందించడం ద్వారా పార్టీని క్షేత్రస్థాయిలో పటిష్టపరచడంపై దృష్టి సారించాలని అన్నారు. ప్రజలను సమీకరించడం, చైతన్యాన్ని అందించడం, పోరాటాలకు సిద్దం చేయడంతో పార్టీ ప్రతిష్ట, ప్రభావం కూడా పెరుగుతుందని అన్నారు. పీడిత ప్రజలను మరింతగా పోరాటాల్లోకి తీసుకురావడానికి ఈ విధానం ఉపయోగపడుతుందని చెప్పారు. ప్రజా పోరాటాల ద్వారా పార్టీని ముందుకు తీసుకుపోవడంతోపాటు బలమైన వామపక్ష ఉద్యమాన్ని నిర్మించాలని అన్నారు.

No comments:

Post a Comment