అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Monday, July 2, 2012

ఉద్యాన పంటల సాగును మరిచారు

రాయితీ విత్తనాల ఊసెత్తని సర్కారు
అదను దాటుతున్నా ధరలు ఖరారు చేయలేదు
రైతులకు ఖాళీ చేతులు చూపుతున్న అధికారులు
మార్కెట్‌లో మండుతున్న విత్తన ధరలు


ఉద్యాన సాగుపై నీలిమేఘాలు కమ్ముకుంటున్నాయి. సర్కారు ఉదాసీన వైఖరికి ఉద్యానశాఖ అధికారులు నిర్లక్ష్యం తోడవడంతో పంటల పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. రైతులకు ఉద్యానశాఖ ద్వారా పంపిణీ చేసే రాయితీ విత్తనాల ధరలు ఇంకా ఖరారు కాలేదు. ప్రైవేటు వారు ఇష్టారీతిన ధరలు పెంచి అమ్ముతుండ టంతో రైతులు నష్టపోతున్నారు.

రంగారెడ్డి రూరల్, న్యూస్‌లైన్: ఒకవైపు వర్షాలు ఆశాజనకంగా కురుస్తుండటంతో రైతులు సాగు పనులకు ఉపక్రమిస్తున్నారు. తీరా పనులు పూర్తిచేసుకున్న రైతులు విత్తనాల కోసం ఉద్యాన శాఖ కార్యాలయాల్లో సంప్రదిస్తే.. లేవంటూ అధికారులు ఖాళీ చేతులు చూపుతున్నారు. కూరగాయలు ఇతర ఉద్యాన పంటలకు సంబంధించి ప్రభుత్వం ఇంకా విత్తనాల ధరలు ఖరారు చేయకపోవడమే ఇందుకు కారణం. వాస్తవంగా ఖరీఫ్ సీజన్ ప్రారం భం నాటికే ఈ ధరలు ఖరారు చేయాల్సి ఉండగా.. ఇప్పటివరకు ఆ కమిటీ సమావేశమే కాలే దు.

భూగర్భ జలాలే ఆధారం
జిల్లాలో 32 వేల హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగవుతున్నాయి. భారీ నీటి ప్రాజెక్టులు లేకపోవడంతో జిల్లా రైతాంగం భూగర్భ జలాలపైనే ఆధారపడి వ్యవసాయం చేస్తోంది. అయితే నగరం చుట్టూ జిల్లా విస్తరించి ఉండటంతో రైతులు ఉద్యాన పంటలవైపే దృష్టి సారిస్తున్నారు. దీంతో ఉద్యాన సాగుకు సంబంధించి విత్తనాలకు జిల్లాలో మంచి డిమాండ్ ఉంది. ప్రస్తుతం ఉద్యాన రైతులు సందిగ్ధంలో పడ్డారు. రాయితీ విత్తనాలపై సర్కారు ఊసెత్తకపోవడంతో పంటల సాగు ప్రశ్నార్థకంగా మారింది.

మార్కెట్‌లో దగా..
ఉద్యానశాఖ ద్వారా పంపిణీ కావాల్సిన రాయితీ విత్తనాల జాడలేకపోవడంతో బహిరంగ మార్కెట్‌లో విత్తనాలు ధరలు ఆకాశాన్నంటున్నాయి. అసలే ఉద్యాన పంటల విత్తనాల ధరలు అధికంగా ఉంటాయి. దీనికి తోడు ప్రైవేటు డీలర్లు ధరలు పెంచడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో క్యారట్(400గ్రాములు) విత్తన ప్యాకెట్ ధర రూ. 550 పలుకుతోంది. గతేడాది ఇదే ప్యాకెట్ ధర రూ.450 ఉంది. అంతేకాకుండా టమాటా, బెండ, బీర చిక్కుడు, బీట్‌రూట్, వంకాయ, గోకర విత్తనాల ధరలు కూడా ఇదే తరహాలో ఒక్కో ప్యాకెట్‌పై రూ. 50 నుంచి రూ.200 వరకు పెంచేసి విక్రయిస్తున్నారు.

కూరగాయల ధరలకు రెక్కలు..
సర్కారు నుంచి ఉద్యాన రైతులకు ప్రోత్సాహకాలు తగ్గుతుండటంతో సాగు మరింత భారమవుతోంది, దీంతో పెద్దసంఖ్యలో రైతులు సాగుకు దూరవువుతున్నారు. ఫలితంగా దిగుబడులు తగ్గుతుండటంతో కూరగాయల ధరలకు రెక్కలొస్తున్నాయి. ఏ రకం కూరగాయలు కొనాలన్నా కిలో రూ.40 కంటే తక్కువగా లేదు. క్యారెట్, సోయాబిన్ ధర రూ.85 వరకు విక్రయిస్తున్నారు. మూడు నెలలుగా రాయితీ విత్తనాలు లభించకపోవడంతో జిల్లాలో ఉద్యాన పంటల విస్తీర్ణం బాగా పడిపోయింది. దీంతో కూరగాయల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.

No comments:

Post a Comment