ప్రజాశక్తి - హైదరాబాద్ ప్రతినిధి
Sun, 1 Jul 2012, IST
కార్మికుని తోడూ నీడా సిఐటియు జెండా.. ధైర్యమిస్తుంది..
దారిచూపుతుంది. కార్మికుని వెన్నంటే.. కార్మికుని వెంటే.. ఏం మాట్లాడినా,
ఏం చేసినా.. ఎక్కడున్నా.. కార్మికుని విజయమే లక్ష్యం.. కార్మికుని సమస్యల
పరిష్కారమే ధ్యేయం.. నగరంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్
ఉద్యోగుల సమస్యలపై సిఐటియు రాష్ట్ర 13 మహాసభల సందర్భంగా ప్రజాశక్తి కథనం..
నగరంలో పని చేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ కార్మికుల, ఉద్యోగుల సమస్యలపై సిఐటియు నిరంతర పోరాటం చేస్తోంది. సిఐటియు పోరాటం ద్వారా జిఓ నెంబర్ 3ను కార్మికులు సాధించుకోగలిగారు. ప్రయివేటు పరిశ్రమల్లో పని చేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని రెండు సార్లు సిఐటియు ఆధ్వర్యంలో సమ్మెలు చేశారు. ఈ సమ్మెతో కొన్ని పరిశ్రమల్లో కార్మికులు తమ సమస్యలను పరిష్కరించుకోగలిగారు.
హమాలీ కూలిరేట్ల కోసం ఆందోళన హమాలీ కార్మికుల కూలిరేట్ల పెంపుదల కోసం సిఐటియు నిరంతర పోరాటం చేసింది. ఆశా వర్కర్ల సమ్మె విజయవంతం చేయడంలో సిఐటియు పోరాటం మరువలేనిది. మున్సిపల్ కార్మికుల జీతాల పెంపుదల కోసం 8 రోజులు సమ్మె చేసి విజయం సాధించిందంటే సిఐటియు పోరాటమే కారణం. భవన నిర్మాణ కార్మికులకు వారంలో పూర్తి పనిదినాలు పని కల్పించాలని ఆందోళనలు జరిగాయి. అంతే కాకుండా పని సమయాల్లో ప్రమాదంలో చనిపోయిన వారికి 50 వేల నుంచి 60 వేల వరకు సిఐటియు జోక్యంతో 10 మందికిపైగా కార్మికులు, వారి కుటుంబాలకు నష్టపరిహారాన్ని ఇప్పించింది. విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు సమరశీల పోరాటాలు నిర్వహించి, కనీస వేతనాల జిఓను అమలు జరిగేంత వరకూ ఉద్యమించారు. విజయం సాధించారు.
పబ్లిక్ సెక్టార్లలోనూ సిఐటియు పాత్ర
పబ్లిక్ సెక్టార్లలో కూడా బిడిఎల్, ఇసిఎల్, బిఇఎల్ లాంటి సంస్థలలో కాంట్రాక్ట్ వర్కర్లు సిఐటియు అండతో రోజుకు రూ.240 కనీస వేతనం సాధించుకోగలిగారు. అంతే కాదు ఆటో డ్రైవర్లు, పెట్రోల్ పంపులు, తోపుడు బండ్లు, చెత్త రిక్షా కార్మికులు, ఫుట్‌పాత్ ఇతర అసంఘటిత రంగ కార్మికులను సమీకరించి అనేక ఉద్యమాలను, పోరాటాలను సిఐటియు సారథ్యంలో నడిపారు. ఈ విధంగా రెండు సంవత్సరాల కాలంలో 60 రకాల పనులు చేస్తున్న లక్షలమంది కార్మికులతో వారి సమస్యలపై రకరకాల ఆందోళనలను సిఐటియు చేపట్టింది. ఎవరికి ఏ సమస్య వచ్చినా సిఐటియు దగ్గరకు వెళ్తే పరిష్కారం అవుతుందనే వాతావరణం కార్మికుల్లో కలుగుతోంది. నగర వ్యాప్త ఉద్యమాలకే పరిమితం కాకుండా జోన్, డివిజన్‌ల వారీగా నివాస ప్రాంత ఉద్యమాలను సిఐటియు నిర్వహించింది. రేషన్ కార్డులు, ఇళ్లు, ఇళ్ల స్థలాలు, కరెంటు, నీరు, డ్రైయినేజీ, మరుగుదొడ్ల సమస్య, పన్నుల భారాలు ఒకటేమిటి అనేకానేక సమస్యల పట్ల ఎక్కడికక్కడ ధర్నాలు, నిరాహార దీక్షలు చేపట్టింది. నగర వ్యాప్త ఉద్యమాలు హైదరాబాద్‌లోని పది పారిశ్రామిక ప్రాంతాల్లో అరవై వేల మంది కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు అమలు కావటం లేదు. రోజుకు 10 నుంచి12 గంటలు పనిచేస్తున్నా అదనపు కూలి చెల్లించడం లేదు. పిఎఫ్ ఖాతాలో డిపార్ట్‌మెంట్‌కి జమచేయడం లేదు. వీటిపై అనేక సార్లు కార్మిక శాఖ దృష్టికి తీసుకుపోయినా పట్టీపట్టనట్లుగా వ్యవహరిస్తోంది. ఈ విధంగా కార్మికుల కష్టార్జితాన్ని దోపిడీ చేస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో సిఐటియు అనేక పోరాటాలు నిర్వహించింది. హమాలీలకు కూలీరెట్ల పెరుగుదలలో సంవత్సరాల తరబడి జాప్యం జరుగుతోంది. చిల్లర వ్యాపారంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవేశంతో షాపింగ్ మాల్స్ నగరంలో పెద్ద సంఖ్యలో పెరిగాయి. దీంతో చిల్లర వ్యాపారులు, తోపుడు బండ్ల వ్యాపారులు బాగా దెబ్బతింటున్నారు. అంగన్‌వాడీల అండ.. సిఐటియు జెండా అంగన్‌వాడీ మధ్యాహ్న భోజనంలో పూర్తిగా మహిళా కార్మికులు పనిచేస్తున్నారు. వీరికి నెలకు లభించే పారితోషికాలు కూడా తక్కువ కావటం వల్ల ఆందోళన బాట పట్టారు. ప్రయివేటు ఆస్పత్రులు, విద్యాసంస్థల్లో పనిచేస్తున్న కార్మికులకు చట్టాలు అమలు కావటం లేదని సిఐటియు పెద్ద పోరాటాలే నిర్వహించింది.
- ధైర్యమిస్తుంది..దారి చూపుతుంది
-
సమస్యల పరిష్కారమే ఎ(ర్ర)జెండా

No comments:
Post a Comment