- కంపెనీల దోపిడీకి లైసెన్స్
- రైతుల హక్కులు హననం
-
అగ్రిమెంటులో వినాశకర షరతులెన్నో...
తివాచీ పరుస్తుంది. పంటలు పండిం చే రైతులకు, వ్యవసాయో త్పత్తులను అమ్ముకునే ప్రైవేటు కంపెనీలకు మధ్య పరస్పర అవగాహన ఒప్పందం చేయడమంటే పిల్లిని, ఎలుకను ఒకే గదిలో బంధించడమే అవుతుంది. సంస్కరణల్లో భాగంగా ప్రైవేట్‌కు దోచిపెట్టేందుకు కేంద్రం మోడల్ మార్కెట్ల చట్టాన్ని తెచ్చింది. దాన్ని ఇక్కడ అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూపొం దించిన ఒప్పంద పత్రంలో పేర్కొన్న షరతులు పైకి రైతుల హక్కులను కాపాడే విధంగా కనబడినా, లోతుగా పరిశీలిస్తే చాలా అంశాలు రైతులను తీవ్రంగా నష్ట పరిచేవిగా ఉన్నాయి. రైతులకు, కంపెనీలకు మధ్య ఒప్పంద వ్యవసాయం (కాంట్రాక్టు సేద్యం)గా సర్కార్ చెబుతున్నప్పటికీ ఆచరణలో రైతులకు నిర్బంధ సేద్యంగా తయార వుతుంది. కంపెనీ సేద్యంలో ప్రభుత్వ పాత్రకానీ, నియంత్రణకానీ లేవు. నిర్ణీత కాల పరిమితిలో కంపెనీలు తమ వద్దకు తీసుకొచ్చిన ఒప్పంద పత్రా లను నమోదు చేసుకోవడం మినహా ఒప్పందాల అమలుపైకానీ, ఉల్లం ఘనలపై చర్యలు తీసుకునే అధికారంకానీ మార్కె టింగ్ శాఖకు లేదు. ఒప్పందాలు చేసుకో కుండా కంపెనీలు రైతులను ప్రైవేటుగా లోబరు చుకుంటే ఏం చర్యలు తీసుకుం టుందో సవరించిన నిబంధనా వళిలో స్పష్టం చేయ లేదు. ఒక పక్క తన చేతులను తానే కట్టేసుకున్న సర్కార్, మరోపక్క ఒప్పంద పత్రంలో షరతులను కంపెనీలకు అనుకూలంగా రూపొందిం చింది. సహకార సేద్యం పేరిట కంపెనీ సేద్యాన్ని 2009లో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ముందుకు తెచ్చినా, ప్రజల వ్యతిరేకతతో వెనక్కి తీసుకున్నారు. ఇప్పుడు వేరే రూపంలో సర్కారు దాన్ని ముందుకు తెస్తోంది. ఇజ్రాయిల్ తరహా సేద్యం అంటూ చంద్రబాబు ముఖ్య మంత్రి గా ఉన్నప్పుడు కుప్పంలో ప్రవేశపెట్టిన సేద్యం విధానం విఫలమైన విషయమూ తెలిసిందే.
కాలపరిమితి లేదు
రైతులకు, కంపెనీలకు మధ్య ఒప్పందం కుదుర్చుకోవాలంటున్న ప్రభు త్వం అగ్రి మెంట్‌కు నిర్ణీత కాలపరిమితి విధించ లేదు. ఇరువురు పరస్పరం ఎన్నేళ్లకైనా ఒప్పందం చేసుకోవచ్చు. అయితే ఒప్పందం కుదిరాక మాత్రం 15 రోజుల్లోపు కంపెనీయే దగ్గర లోని మార్కెట్ కమిటీవద్దకానీ, మార్కెటింగ్ ఏడి వద్ద కానీ రిజిస్టర్ చేయించుకోవాలి. కౌలు రైతులకు ప్రభుత్వం జారీ చేస్తున్న గుర్తింపు కార్డుకు కాల పరిమితి ఒక సంవత్సరమే. అంటే భూయజమానులు, కౌలుదా రుల మధ్య సాగు ఒప్పందాన్ని సర్కార్ కేవలం ఏడాదికే పరిమితం చేసింది. అలాంటిది కంపెనీకి, రైతులకు మధ్య జరిగే అగ్రిమెంట్‌కు మాత్రం ఎలాంటి కాల పరిమితీ విధించకపోవడం గమనార్హం.
వాతావరణాన్ని మరిచారు
మార్కెట్‌లో డిమాండ్‌కు అనుగుణంగా కంపె నీలు ఏ పంటలు కావాలని అడిగితే ఆ పంటలను రైతులు విధిగా పండించాలి. అందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులు విధిగా ఆ కంపెనీల నుండి పొందాలి. తమకు కావాల్సిన పంటలు పండించేందుకు అనువుగా భూమి రూపురేఖలను కంపెనీ మార్పు చేస్తుంది. నర్సరీ, ఎరువులు, పురుగు మందులు, ఇరిగేషన్, హార్వె స్టింగ్ తదితరాలను రైతులు కంపెనీ నుండే తీసుకో వాలి. అవి అప్పు కిందే అందుతాయి. సలహాలను సైతం కంపెనీ రైతులకు పెట్టే ముందస్తు పెట్టుబడి (అప్పు) కిందనే పేర్కొన్నారు. దీని ప్రకారం సలహాలకు సైతం రైతులు ఛార్జీలు చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఒప్పందపత్రంలో ఫలానా నిబంధనల ప్రకారం నాణ్యమైన ఉత్పత్తులిస్తామని, ఫలానా పరిమాణంలో ఫలానా తేదీకి కంపెనీ నిర్ణయించిన స్థలానికి తామే తీసుకొస్తామని రైతులు స్పష్టంగా పేర్కొనాలి. అగ్రిమెంట్‌లో పేర్కొన్న విధంగా నాణ్యతను, పరిమాణాన్ని విధిగా పాటించాలి. ఏ కొంచెం తేడా వచ్చినా రైతులు తీసుకొచ్చిన పంటలను తిరస్కరించే అధికారం కంపెనీలకు కట్టబెట్టారు. ఇది వినాశకరమైన షరతు. నాణ్యత, పరిమాణం అనేది రైతు చేతుల్లో లేదు. వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంది. వాతావరణ పరిస్థితులకు సంబంధించిన అంశం ఎక్కడా అగ్రిమెంట్‌లో పేర్కొనలేదు. ఆ అంశం లేకుండా నాణ్యత, పరిమాణాలను తప్పనిసరిగా రైతులు పాటించాలనడం కంపెనీలకు లాభం కలిగిస్తుంది.
కంపెనీలకు విచ్చలవిడి స్వేచ్ఛ
ధర విషయంలోగానీ, నాణ్యత విషయంలోగానీ తేడా వస్తే మరోసారి చర్చించే అవకాశం ఇచ్చినా, కంపెనీలు నిర్ణయించిన ధర గిట్టకపోతే రైతులు స్వేచ్ఛగా మార్చెట్‌లో తమ ఉత్పత్తులను అమ్ముకోవచ్చని చెబుతున్నా అది ఆచరణ సాధ్యం కాదు. ఎందుకంటే కంపెనీ చెప్పిన సమయానికి, స్థలానికి రైతులు పంటలను తీసుకెళతారు. అప్పుడు రైతుకు రవాణా ఛార్జీలవుతాయి. కంపెనీలతో సరిపడనప్పుడు వేరే చోటకు పంటలను తరలించాలంటే రవాణాకు రైతులు మరింత ఖర్చు చేయాలి. అందువల్ల కంపెనీ చెప్పిన ధరకు రైతులు తెగనమ్మక తప్పని పరిస్థితి. ఇంకో కీలక అంశమూ ఉంది. రైతులు తీసుకొచ్చిన పంటలను కొనుగోలు చేశాక కంపెనీలు తాము అప్పటి వరకు పెట్టిన పెట్టుబడులను (అప్పులు) మినహాయించుకొని రైతులకు మిగిలిన సొమ్ము చెల్లించాలన్నది ఒప్పందంలోని షరతు. కంపెనీలకు అవసరమైన పంటలు పండించాక, వారి సలహాలను, పెట్టుబడులను విధిగా తీసుకున్న తర్వాత రైతులు కంపెనీలకు తమ ఉత్పత్తులను అమ్మాల్సిందే. అలాంటప్పుడు కంపెనీ చెప్పిన ధరకే అమ్మాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో కంపెనీ చెప్పిన ధర తక్కువైనప్పుడు రైతులు బయటికి తీసుకెళ్లి అమ్ముకునే పరిస్థితి ఉండదు. ఆ స్వేచ్ఛ రైతుకు ఇచ్చినప్పటికీ పంటలు అమ్ముకోకుండా రైతులు తమకు పెట్టుబడి పెట్టిన కంపెనీలకు అప్పులు చెల్లించడం సాధ్యం కాదు. కంపెనీలకు అవసరమైన పంటలను పండించినప్పుడు ఆ కంపెనీలే కొనాలి. బయట అమ్ముడు పోతాయన్న గ్యారంటీ లేదు. కంపెనీలు ముందుగా పెట్టుబడులు పెడుతున్నాయి కనుక తమకు కావాల్సిన విధంగా రైతులు పంటలు పండిస్తున్నారా లేదా అని పర్యవేక్షించే అధికారం దానికి ఉంది. కంపెనీ ప్రతినిధులు స్వేచ్ఛగా రైతుల పొలాల్లోకి ప్రవేశించి సాగును పరిశీలించవచ్చు. ఈ షరతు రైతుల ఆత్మగౌరవానికి భంగం కలిగిస్తుంది.
'మద్దతు' లేని వాటి మాటేంటి?
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించిన కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి)కి తక్కువ కాకుండా రైతులకు కంపెనీలు చెల్లించాలని ఒప్పందంలో పేర్కొన్నారు. చాలా పంటలకు ఎంఎస్‌పి అనేది లేదు. అలాంటి వాటి విషయంలో ఏం చేస్తారో పేర్కొనలేదు. కంపెనీ సాగంటే సాధారణంగా వాణిజ్య పంటలకే ఎక్కువ ప్రాధాన్యమిస్తాయి. చాలా వాణిజ్య పంటలకు ఎంఎస్‌పీని ప్రభుత్వాలు నిర్ణయించట్లేదు. పండ్లు, కూరగాయల సంగతి చెప్పనక్కర్లేదు. మార్కెట్‌లో ఎగుడుదిగుడులను బట్టి కంపెనీలే ధర నిర్ణయిస్తే రైతులు తీవ్రంగా నష్టపోతారు.
No comments:
Post a Comment