అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Sunday, January 27, 2013

అభివృద్ధికి 'మహా' నిర్దేశం

2031 వరకు ప్రణాళికబద్ధమైన పురోగతి
వ్యవసాయ, నివాస జోన్లకే పెద్దపీట
బృహత్‌ ప్రణాళికలో అనేక కీలక మార్పులు
రవాణా వ్యవస్థకు సమగ్ర రూపం
చర్చనీయాంశంగా మారిన 'మారటోరియం'

(ఈనాడు, హైదరాబాద్‌) January 26, 2013
నడవాలంటే ఒక దారి కావాలి. మరి అభివృద్ధికి.. ఒక వ్యూహం.. అంతకుమించిన ప్రణాళిక ఉంటేనే అది అర్థవంతమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా అంచనాలకు మించి దూసుకుపోతున్న పట్టణీకరణ దరిమిలా ప్రణాళికాబద్ధమైన అభివృద్ధికి ప్రాధాన్యం ఎంతో పెరుగుతోంది. అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడుతున్న హైదరాబాద్‌ నగరం రోజురోజకీ శరవేగంగా విస్తరిస్తోంది. గణనీయమైన అభివృద్ధి సాధిస్తోంది. హైదరాబాద్‌ మహా నగరాభివృద్ధి రూపొందించిన బృహత్‌ ప్రణాళిక-2031 ప్రభుత్వం ఆమోద ముద్ర వేసిన విషయం తెలిసిందే. దాదాపు మూడేళ్ల కసరత్తుతో రానున్న 20 ఏళ్లకు వేసిన ప్రణాళికలోని ప్రధాన అంశాలను ఓసారి పరిశీలిస్తే...

మహా ప్రణాళిక... ఆహా అభివృద్ధి


రూ.లక్ష కోట్లు కావాలి!

భారీగా 'హైమా' సమగ్ర ప్రణాళిక భారం
నిధులు కేటాయింపు అంత సులువు కాదు

ఈనాడు, హైదరాబాద్‌, January 25, 2013
అవును... నిజమే... తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన హైదరాబాద్‌ మాస్టర్‌ ప్లాన్‌ను అమలు చేయాలంటే ఒకటి కాదు... రెండు కాదు... అక్షరాల లక్ష కోట్ల రూపాయలు అవసరం. రానున్న 20 ఏళ్లలో ఇంత భారీ మొత్తం కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధమేనా? లేక మునుపటి ప్రణాళికల మాదిరిగానే ఇదీ కాగితాలకే పరిమితం కానుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నగరంతో పాటు సరిహద్దున ఉన్న అయిదు జిల్లాల్లోని 5,965 చదరపు కిలోమీటర్ల పరిధిలో హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హైమా) అభివృద్ధి మాస్టర్‌ ప్లాన్‌ ఖరారైంది. సుమారు రెండేళ్ల కసరత్తు అనంతరం ఒక కొలిక్కివచ్చిన దీనికి ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది.

ఇక 'మహా' అభివృద్ధి!

నగరం చుట్టూ ప్రణాళికాబద్ధంగా..
అడ్డదిడ్డ కట్టడాలకు చెల్లుచీటీ
సహజ వారసత్వ ప్రాంతం నుంచి వూరట
300 మీటర్ల వరకూ గ్రామ కంఠ పరిధి
బృహత్తర ప్రణాళికపై ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం

ఈనాడు - హైదరాబాద్‌ Friday, January 25, 2013
హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి బృహత్తర ప్రణాళికకు ఎట్టకేలకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ముసాయిదాను విడుదల చేసిన దాదాపు ఏడాదిన్నర తర్వాత ప్రణాళికను అమల్లోకి తెస్తూ గురువారం పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి శ్యాంబాబు ఉత్తర్వులు జారీ చేశారు. ముసాయిదాలో స్వల్ప మార్పులు చేర్పులు చేసింది. వచ్చే 20 ఏళ్లలో ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి అంతా ఈ ప్రణాళికను అనుసరించే జరగనుంది. 2031 వరకూ హైదరాబాద్‌ చుట్టూ 5 జిల్లాల్లోని 35 మండలాలు... 849 గ్రామాలు... 5,965 చదరపు కిలోమీటర్ల విస్తరిత ప్రాంతం కోసం హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) ఈ బృహత్తర ప్రణాళికను రూపొందించింది.

Thursday, January 24, 2013

బాలికలు తగ్గారు! - జాతీయ బాలికల దినోత్సవం



సామాజిక, ఆర్థిక పరిస్థితుల కారణంగా గత దశాబ్ద కాలంలో బాలికల శాతం తగ్గింది. గత దశాబ్ద కాలంలో సుమారు 30 లక్షల మంది బాలికలు అదృశ్యమయ్యారు.
Written by Parvathi On 1/24/2013 11:41:00 AM
ఆడపిల్ల పుడితే ఆడపిల్ల కాదు... పాడు పిల్ల అనే అవగాహన నుంచి బయటపడితే మహిళల మీద జరుగుతున్న హింసకు అడ్డుకట్ట పడుతుంది. ఆడపిల్ల పుట్టుక భారంగా భావించి పురిటిలోనో, గర్భస్థ శిశువుగానో కడతేర్చే పరిస్థితులున్న సమాజంలో వారి భద్రత ఎప్పుడూ ప్రశ్నార్థకంగానే మారింది. చాలా సందర్భాల్లో ఆడ శిశువులను పిండంగానే పరిమారుస్తున్న పరిస్థితి నిత్యం జరుగుతోంది.