- స్వేచ్ఛానువాదం: ముక్తవరం పార్థసారథి
తనలో ఏదో మార్పు వస్తోంది. ఈ పరిస్థితి గురించి మొదటి సంవత్సరంలోనే తండ్రికో లేఖ రాశాడు కార్ల్ :
'డియర్ ఫాదర్,
మిమ్మల్ని వదలి వచ్చినప్పుడు నా ముందు ఓ కొత్త లోకం ఆవిష్కృతమైంది. అది ప్రేమ లోకం. ఇంకా నేను చేరుకోలేని ఓ ప్రేమ లోకం. బెర్లిన్‌కు రావటం ఒక అద్భుతమైన అనుభవంగా మిగలాలి. కానీ అది కూడా నాకు ఆనందం ఇవ్వలేదు. శిలగా మారిన నా మనసుకన్నా కరకు శిలలేమీ నాకు దారిలో కనిపించలేదు. భోజనం