దళిత కవిత్వానికి తల్లి భాష, తల్లి తనం ప్రాణం. ప్రతి దళిత కవికీ వాళ్ళ
అమ్మే మొదటి గురువు. తల్లి మూల పదాలు పలుకుతుంది. ప్రతీకాత్మకం గా
మాట్లాడుతుంది. మానవ త్వాన్ని శృతి చేస్తుంది. తెలుగు మూల పదాల్లో జీవశక్తి
ఉంది. తరతరాలుగా అణచబడ్డ ప్రజలు చీకటి నుంచి మాట్లాడారు. వాళ్ళు చీకటిలో
బ్రతుకుతున్న వెలుగును గుండెలో దాచుకున్నారు. ఈ అభివ్యక్తి తెలుగు
సాహిత్యానికి కొత్త వెలుగులు తెచ్చింది. అనంత వేదనలు
మోసుకొచ్చింది. తెలుగు సాహిత్యంలో అప్పటి వరకు ఉన్న సంప్రదాయ, భావవాద, అభ్యుదయ, విప్లవ, స్త్రీ వాదాలు చూడని కోణాన్ని దళిత కవిత్వం బలంగా చూపిం చింది. ఈ కవిత్వం ఒక యుగ ప్రస్థానం చేయగలగడానికి కారణం సత్య వాక్యం, కులాధిపత్య ధిక్కరణ, బౌద్ధ సమతా భావన. నల్ల కలువ దళిత కవితా నిర్మాణంలో ఒక తాత్విక దృక్పథాన్ని అందించింది.
అస్పృశ్యతా మూలం
అస్పృశ్యత తరతరాలుగా భారత సమాజాన్ని పీడిస్తోంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అస్పృశ్యత నివారణ కోసం చట్టాలు రూపొందించినా ఈ అస్పృశ్యుల మీద దాడులు ఎందుకు జరుగుతున్నాయి? ఈ దాడికి వ్యతిరేకంగా వస్తున్న కవిత్వం లో వస్తు వాస్తవికత ఉంది కదా? సామాజిక వాస్తవికత ఉంది కదా? అంబ్కేరుకు ముందు, తర్వాత భారత సామాజిక వ్యవస్థా రూపాలు మారలేదా? అంబేద్కర్ అస్పృశ్యతా కులాలను ప్రధాన స్రవంతిలోకి తేవడానికి విద్య, భూమి, ఉపాధి, గృహ నిర్మాణం, ఆహార్యం, అభివ్యక్తిలో స్వేచ్ఛను కోరారు. అప్పటి వరకూ మౌఖిక సమాజంగా ఉన్న దళితులు వ్రాయడం ప్రారంభించారు. ఆ వ్రాతలో మేమూ అనే ఒక ఆత్మీయత, ఒక చరిత్ర ప్రారంభమైంది.
నల్లకలువ సృష్టి
కారంచేడు ఉద్యమం తర్వాత దళిత ఉద్యమం ఒక ఉద్యమ సంస్థగా ఏర్పడి ఒక సాంస్కృతిక పునాదిని కలిగి ముందుకు సాగుతున్న క్రమంలో 'నల్లకలువ'ను సృష్టించింది. 'నల్లకలువ'లో కవితాభివ్యక్తి ఆత్మగౌరవాన్ని ప్రకటించింది. ''నేను నల్లనిదానను/నా చెమట చినుకులతో/భూమి ప్రియుడు పులకిస్తున్నాడు/ నాగేటిచాళ్లలో నేను చల్లిన విత్తులు/నా పాదాల ఎరువుతో మొలకెత్తుతున్నాయి/ చిగురా కుల వంటి నా వ్రేళ్ళు/భాగ్యనగర్ నిర్మాణంలో రాళ్లయ్యాయి/ నా స్తన్యం గ్రోలిన బిడ్డడే/నన్ను చెంగుపట్టుకున్నప్పుడు/ఈ దేశం గుండెల్లో దాగున్న రాచపుండు/నాకర్థమయింది''. (నల్లకలువ, పేజి : 7)
దళిత ప్రతీకలు
ఈ ప్రతీకలు కేవలం ఆర్థిక పోరాటంలో రావు. అస్పృశ్యతకు గురై వ్యథ చెందినప్పుడే ఇది సాధ్యం. అస్పృశ్యత ఒక అనుభవమే కాదు ఒక జీవన సంఘర్షణ. ఒక మానవతా రహిత భావనకు, మనిషికి మధ్య జరిగే యుద్ధం. ఆ యుద్ధం నుంచి మనిషిని వెలిగించే కవిత్వం వస్తుంది. మనిషిని యుద్ధ యోధుడిగా మారుస్తుంది. తాత్వికుడిగా మలుస్తుంది. మానవత్వాన్ని శిఖరాయమానం చేస్తుంది. మనిషికి మూల మైన మనిషితత్వం కోల్పోయినప్పుడే మనిషి క్రూరుడవు తున్నాడు. దీని మీద దళిత కవిత్వం విరుచుకు పడింది. దళిత కవిత్వంలో అగ్నిజ్వాల ఉంది. అది మనిషిని కాగడాగా వెలిగి స్తుంది. పోరాటానికి సిద్ధం చేస్తుంది. ఆలోచనకు పురిగొల్పు తుంది. అగ్రకులం వాళ్లు కూడా దళిత కవిత్వం చదివితే వారిలో ఉన్న అస్పృశ్యతా భావం తొలగిపోతుంది. కవిత్వం పరమార్థం అదే. అందుకే దళిత కవితా యుగం తెలుగు సాహిత్యానికి వన్నె తెచ్చింది. కవితా రూపంలో కొత్త పోకడలు రూపొందించింది. కవిత్వానికి సున్నితత్వం ప్రాణం. సమాజం లో ఉండే అంతస్సంబంధిత విషయాలను సున్నిత మైన పదజాలంతో చెప్పగలగాలి. ఆ సుతిమెత్తని భావజాలం తో చరిత్రను జ్ఞాపకం చేయగలగాలి, నిర్దేశించగలగాలి. నల్ల కలువలో ఈ చారిత్రక, రాజకీయ ప్రకటన కవితాత్మకంగా జరిగింది.
దళిత కవిత్వ ప్రత్యేకత
తెలుగు సాహిత్యానికి ఒక దిశా నిర్దేశం చేయగలిగింది. ఒక కొత్త సృష్టికి మార్గం సుగమం చేసింది. ఆవేదనను, ఆలోచనను సమన్వయించింది. వ్యక్తిత్వాన్ని, నీతిని, సామాజిక తను, సౌహార్ధ్రతను కవిత్వంలో పెనవేసింది. కరుణ, ప్రేమ, ప్రజ్ఞలను కవిత్వంలో రంగరించింది. అంబేద్కర్, ఫూలే, పెరియార్, బుద్ధుని తత్వశాస్త్రాలను కవిత్వంలో అభివ్యక్తి చేసింది. సమతా భావాన్ని, సామాజిక విప్లవాన్ని, నూతన అలంకారాలతో, ప్రతీకలతో ప్రజ్వలింప జేసింది. ప్రత్యా మ్నాయ సాంస్కృతిక విప్లవానికి బాటలు వేసింది. కొత్త అలంకార శాస్త్రాన్ని రూపొందించింది. దళిత కవిత్వం ప్రతీకలను పూర్తిగా మార్చింది. దళితుల జీవనంలో దేశీయత ఉంది. పక్షులను, ప్రకృతిని దళితులు చూసే కోణం వేరు. కాకి ఎప్పటి నుంచో దళిత సింబల్‌గా ఉంది. జాషువా కవిత్వంలో కూడా నిర్లక్షితమైన కాకి, గబ్బిలం, సాలీడు, శునకం వంటి జంతువులపైనే ఆయన కళాత్మకంగా రాయడం జరిగింది. దళిత కవిత్వం జీవిత ఘర్షణ నుంచి, అస్పృశ్యతను ఎదుర్కొనే పోరాటం నుంచి మానవత్వాన్ని ప్రజ్వలింపజేసే దిశ నుంచి జంతువులనుగానీ, పక్షులనుగానీ, ప్రకృతినిగానీ చూడ గలిగింది.
జీవితం నుంచి కవితా ధార
జీవితమంతా పెనుగులాటే. గుప్పెడు బువ్వకోసం, జానెడు నేల కోసం, తలదాచుకోవడం కోసం ఒక యుద్ధమే జరుగుతుంది. నదిని, కొండని జీవితానికి అన్వయించుకొని ఈ సమాజాన్ని, ప్రకృతిని ఎంతో ఓపికగా ఎదుర్కొని దళితులు జీవిస్తుంటారు. అందుకనే వీరి అలంకార శాస్త్రమే వేరు. దళిత కవిత్వం విస్తారంగా కవుల పంట పండించింది. దళిత కవిత్వానికి సామూహిక గుణం ఉంది. సుదీర్ఘ చారిత్రక, సాంస్కృతిక నేపథ్యం ఉంది. చార్వాకులు, బౌద్ధులు, జైనులు, భక్తి కవులు, హేతువాద తాత్వికులు వీరికి సాంస్కృతిక నేపథ్యాన్ని అందించారు. మరి ఏ కవిత్వం కంటే కూడా ఇది దేశీయమైంది. భారత భూమి నుంచి మూలవాసులు మౌఖిక దశ నుంచి లిఖిత సమాజానికి పరివర్తితమైన దశను ఇది నిర్ణయించింది. వందలాది మంది కవులు, వేలాది మంది గాయకులు, లక్షలాది మంది కళాకారులు, కోట్లాది మంది ప్రజలు ఈ మార్గంలో పయనించడానికి ఈ ఆధునిక దళిత కవిత్వ యుగం పెనుకేక వేసింది.
దళిత కవిత్వానికి ప్రాణం తల్లి
దళిత కవిత్వానికి పతాక శీర్షిక తల్లి కేకే. మాతృత్వం దళిత కవిత్వానికి తాత్విక భూమిక. ఇక్కడ తల్లి తన కోసం జీవించదు. తన బిడ్డల కోసం, వాళ్ల రక్షణ కోసం జీవిస్తుంది. దళిత తల్లి ఒక యుద్ధ యోధురాల్లా, ఒక కమేండోలా జీవిస్తుంది. తన బిడ్డను రక్షించుకోవడానికి భర్తతో, సమాజంతో, ప్రకృతితో, నిప్పుతో, నీరుతో, అగ్నితో ఆమె యుద్ధం చేస్తూనే వెళుతుంది. ఏ దళిత విద్యార్థి అయినా, నాయకుడు అయినా ప్రధానంగా తల్లితో పెరిగిన వాడే. తల్లి త్యాగాల వల్ల రూపొందిన వాడే. తల్లి గుణాలే బిడ్డలకు ఉంటాయి. తల్లి అనే పాఠశాలలోనే కరుణ, ప్రేమ, మానవత్వం దళితులు నేర్చుకుంటారు. వీళ్ళు పుస్తకాల్లో కంటే మస్తకాల్లోనే ఎక్కువ నేర్చుకుంటారు. కవిత్వానికి ఉండ వలసిన తత్వం ప్రధానంగా తల్లితనం. ఇతరులకు భావోద్వే గాన్ని పంచగలగడం. అది తల్లి నుంచే దళితులు నేర్చుకుం టారు. ముందుగా దళిత కవిత్వానికి తల్లే ప్రాణం. చరిత్ర గమనంలో కూడా భావోద్వేగాలను తల్లి నుంచి గ్రహించిన వారే సమాజానికి మూలకర్తలయ్యారు.
దళిత కవిత్వం చారిత్రక స్పృహలోంచి వచ్చింది. చరిత్రలో తమ అస్తిత్వాన్ని చాటి ఆధిపత్యం వహిస్తున్న అన్ని వర్ణాల స్థానాన్ని నిర్ణయిస్తుంది. పితృస్వామ్య వ్యవస్థా పూరితమైన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణాలన్నిటి మీద యుద్ధం ప్రకటించి తన వ్యక్తిత్వాన్ని చాటు కోవడంలోనే దళిత కవిత్వం మూలం ఉంది. తన తల్లి తన కుటుంబం సామాజిక పరిణామంలో భాగమని, ప్రకృతి ప్రేరణలో భాగమని దళితులు విశ్వసిస్తారు. ఈ ఆత్మవిశ్వాసమే యుగాన్ని సృష్టించింది. ఇది వందకు వంద దళిత కవితా యుగం. ఈ యుగంలో కవిత్వం, తత్వశాస్త్రం, అలంకారశాస్త్రం, సాహిత్యం, దళితుల పునాదిగా నడుస్తున్నాయి. ఈ యుగ కవిత్వంలోని ప్రధాన లక్షణం సామూహికత, సంఘ దృష్టి, సమత, మానవత, మాతృత్వం. అంబేద్కర్, ఫూలే, బుద్ధుడు, ప్రత్యామ్నాయ సంస్కృతి ఈ యుగ కవిత్వానికి తాత్విక భూమికను అందించాయి. ఇది నిరంతర ప్రవాహిక. సాహిత్య పరిణామానికి ఇది ప్రధాన వాహిక.
- డా|| కత్తి పద్మారావు
(వ్యాసకర్త సామాజిక ఉద్యమ నేత)

No comments:
Post a Comment